‘యానిమల్, పుష్ప ది రూల్, చావా, కుబేర’ వంటి వరుస సక్సెస్‌లతో కెరీర్‌లో దూసుకెళ్తున్నారు రష్మికా మందన్నా. ఒకవైపు హీరోయిన్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా చేస్తున్నారామె. ఇప్పటికే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే మూవీ చేస్తున్నారు రష్మికా మందన్నా. ‘చిలసౌ, మన్మథుడు 2’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రాహుల్ రామక్రిష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో రిలీజ్ కాకుమందే ‘మైసా’ (Rashmika Mandanna Mysaa) అనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్మికా మందన్నా.
మంచు విష్ణు కన్నప్ప మూవీ రివ్యూ
రష్మికా మందన్నా(RashmikaMandanna) ఓ వారియర్ లుక్‌లో కనిపిస్తారు. ఈ ‘మైసా’ (Mysaa movie) సినిమాకు రవీంద్ర పుల్లె (mysaa movie director Rawindra Pulle) దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్, అజయ్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి గోపా సహ-నిర్మాత. మైసా అనేది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. గొండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని, దర్శకుడు రవీంద్ర ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఓ సరికొత్త అవతారంలో రష్మికా మందన్నా నటించనున్నారు. ‘మైసా’ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు చెందిన సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

ఇక గతంలో ‘రెయిన్ బో’ అనే ఓ ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్‌కు కూడా రష్మికా మందన్నా ఒప్పుకున్నారు. తమిళనాడు, ఊటీ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ కూడా జరిగింది. కానీ సడన్‌గా ఈ సినిమా చిత్రీకరణ ఎందుకో ఆగిపోయింది. బహుషా…ఈ సినిమా క్యాన్సిల్ అయిఉండవచ్చు.
మరోవైపు…హిందీలో ‘థామ, కాక్‌టైల్ 2′ అనే సినిమాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. ఈ సినిమా కాకుండ విజయ్‌దేవరకొండ, రాహుల్ సంక్రుత్యాన్ కాంబినేషన్‌లో రానున్న మరో మూవీలోనూ రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే… ‘గీతగోవిందం, పెళ్ళిచూపులు’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల కాంబినేషన్‌లో వచ్చే మూడో చిత్రం ఇదే అవుతుంది.