TheGirlFriend Trailer: రష్మిక మందన్నా (RashmikaMandanna) ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. నవంబరు 7న (TheGirlFriend Movie Release date)ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా ఉంది. ముఖ్యంగా రష్మిక మందన్నా ఇంటెన్స్ యాక్టింగ్ బాగుంది. ఈ సినిమాలో భూమా పాత్రలో రష్మిక, విక్రమ్‌గా దీక్షిత్ శెట్టి, దుర్గా పాత్రలో అను ఇమ్మాన్యూయేల్ నటించారు. కథ అంతా ఈ ముగ్గురి పాత్రల చుట్టే తిరుగుతుందని స్పష్టం అవుతోంది. రావురమేష్, రాహుల్ రవీంద్రన్‌లు కూడా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో నటించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఓ కొత్త కోణాన్ని ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఆవిష్కరించ నున్నట్లుగా, విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తుంది.
ఇక విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
మనమోక చిన్న బ్రేక్ తీసుకుందామా?..చిన్న అంటే చిన్న కాదు…ఒక బ్రేక్ లాగా…! (రష్మిక మందన్నా)
ఎల్లుండే ముహూర్తం ఉందట..పెళ్లి చేసుకుందామ్….. (దీక్షిత్‌శెట్టి)
నువ్వు విక్రమ్‌తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా?…విక్రమ్‌కి అయితే నీలాంటి అమ్మాయి పర్‌ఫెక్ట్…కానీ వాడు నీకు కరెక్ట్ కాదు…. (అను ఇమ్మాన్యూయేల్)
ఇక్కడ నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావ్…అన్నదే ఇంపార్టెంట్ (రాహుల్ రవీంద్రన్)
నేను నీతో హ్యాపీగా లేను… (రష్మిక మందన్నా)
భూమా నా గర్ల్‌ఫ్రెండ్ అండ్ ఉయ్ లవ్ ఈచ్ అదర్… (దీక్షిత్ శెట్టి)
అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఈ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్.