Mass Jathara Trailer: రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్‌లోని 75వ సినిమా ఇది. ఈ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా రిలీజ్ ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ సిని మాను అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇదే తేదీన ప్రభాస్ – దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా కూడా విడుదల అవుతోంది. దీంతో నవంబరు 1న ‘మాస్ జాతర’ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో 31 సాయంత్రం 6 నుంచే ‘మాస్ జాతర’ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ప్రభావం వల్ల ‘మాస్ జాతర’ సినిమా ఇలా 31వ తారీఖు సాయంత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇక విడుదలైన, ఈ సినిమా ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
కేజీ ఇరవై కేజీలు కాదురా…ఇరవైటన్నులు….ఈ రాత్రికే సరుకును గూడ్స్ ట్రైన్‌లోకి ఎక్కించండి….
అదీ మన ఊరు స్టేషన్ నుంచి వెళ్లడం లేదన్నా..అక్కడ ఆ రైల్వే ఎస్‌ఐగాడు ఉంటాడు….
ఇన్ని రోజులు నువ్వు నా లిమిట్స్‌లోకి రాక నీ దందా నడిచింది….
నేను రైల్వే పోలీస్ కాదు…క్రిమినల్ పోలీస్
రైల్వేలో ఈస్ట్ జోన్…వెస్ట్ జోన్…నార్త్ జోన్…సౌత్ జోన్‌లు ఉంటాయి…నేను వచ్చినాక ఒకటే జోన్… వార్ జోన్…
ఈ ‘మాస్ జాతర’ సినిమాలో నవీన్ చంద్ర విలన్ రోల్ చేస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. ‘థమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటించిన సినిమా ఇది. ‘థమాకా’ సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే, ఈ ‘మాస్ జాతర’ సినిమాకూ సంగీతం అందించాడు. ఈ ‘మాస్ జాతర’ సినిమాలో లక్ష్మణ్‌భేరి అనే ఓ పోలీస్‌ఆఫీసర్ పాత్రలో రవితేజ నటించాడు. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.