Mass Jathara new Release: రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. ఇప్పటికే మూడుసార్లు (2025 సంక్రాంతి, మే9, వినాయకచవితి) ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ అక్టోబరు 31న (Mass Jathara new Release Date) రిలీజ్ ఈ సినిమా కొత్త రిలీజ్‌డేట్‌ని ఫిక్స్ చేశారు. ఈ డేట్‌కి ఎలాగానే కచ్చితంగా థియేటర్స్‌కు రావాలని ‘మాస్ జాతర’ టీమ్ ఫిక్సైంది.
కానీ ఇదే తేదీన బాహుబలి: ది ఎపిక్ సినిమా కూడ విడుదలకు సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్’ సినిమాలను కలిపి ఈ నెల 31న ‘బాహుబలి: ది ఎపిక్’గా (TheBahubaliTheEpic New Release date) రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎడిటింగ్ పనుల్లో స్వయంగా రాజమౌళియే ఇన్‌వాల్వ్ అయ్యారు. బాహుబలి బ్రాండ్ ఇమేజ్‌కి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో రాజమౌళి–ప్రభాస్‌ల బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాకు పోటీగా రవితేజ (Raviteja) మాస్ జాతర (MassJathara) సినిమా థియేటర్స్‌కు రానుంది. బాహుబలి ఎపిక్‌ను మాస్ జాతర సినిమా టీమ్ రీ రిలీజ్‌గా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆడియన్స్ ఈ సినిమాను ఓ సెలబ్రేషన్‌లా తీసుకుంటే మాత్రం..మాస్ జాతర టీమ్‌కు తిప్పలు తప్పవు. మరి..ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.
మాస్ జాతర సినిమాలో లక్ష్మణ్‌భేరీగా రవితేజ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. నవీన్‌చంద్ర విలన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసి రోలియో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ‘ధమాకా’వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ– శ్రీలీల– భీమ్స సిసిరోలియో కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మాస్ జాతర’. సామజవరగమన సినిమాకు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.