నవీన్‌చంద్ర హీరోగానే కాదు..వీలైనప్పుడల్లా..విలన్ రోల్స్ కూడా చేస్తుంటాడు. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్, అమ్ము’ సినిమాల్లో విలన్‌గా నవీన్‌చంద్ర మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు.తాజాగా రవితేజ సినిమా (MassJathara update)లో నవీన్‌చంద్ర (Naveenchandra) విలన్‌గా చేస్తున్నాడు. ఈ విషయాన్ని నవీన్ చంద్రయే చెప్పాడు.
‘‘రవితేజ (raviteja)గారు ‘మాస్‌జాతర’ (Massjathara) సినిమాలోని విలన్ రోల్‌కు నన్ను రిఫర్ చేశారు. ఈ మూవీలో మంచి స్ట్రాంగ్ రోల్ చేశాను. అరవిందసమేత వీరరాఘవ సినిమాలో ఎలాగైతే నా రోల్‌కు మంచి అప్రీషియేషన్ వచ్చిందో, అలాంటి మంచి రోల్‌ను మాస్ జాతర సినిమాలో చేశాను. రవితేజకు – నాకు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అదిరిపోతాయి. మాస్ జాతర సినిమా టాకీ పార్టు ఆల్మోస్ట్ పూర్తయింది. ఒట్రెండ్రోజులు ప్యాచ్ వర్క్ ఉంది అంతే. సాంగ్స్ కూడా పూర్తయితే, రిలీజ్ డేట్‌ను చెబుతారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ (Raviteja Massjathara Release) కోసం నేను కూడా ఆసక్తిక రంగా ఎదురుచూస్తున్నాను’’ అని నవీన్‌చంద్ర చెప్పుకొచ్చారు.మాస్ జాతర సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ (massJathara heroine). భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌డైరెక్టర్. ధమకా వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల యాక్ట్ చేసిన సినిమా ఇది.
లైనప్‌పెద్దదే..!
కరుణకుమార్ డైరెక్షన్‌లో ‘హనీ’ అనే ఎక్స్‌ట్రీమ్ డార్క్ మూవీలో హీరోగా చేస్తున్నాను నవీన్‌చంద్ర. తమిళ నూతన దర్శకుడు హరి తీస్తున్న కామెడీ మూవీలో సునీల్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నాడు. ఆనంద్‌దేవరకొండ, వైష్ణవీ చైతన్యలు కలిసి బేబీ తర్వాత చేస్తున్న మరో సినిమాలో నవీన్‌చంద్ర ఓ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండ…తమిళంలో మరో మూవీ, ఇన్‌స్ఫెక్టర్ రిషి సినిమాలను కూడా చేస్తున్నట్టుగా నవీన్‌చంద్ర చెప్పుకొచ్చాడు.