2022లో వచ్చిన ‘థమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ కెరీర్‌లో సోలో హీరో సూపర్‌హిట్ పడలేదు. రవాణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్…ఇలా వరుస సినిమాల్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. ‘విక్రమార్కుడు, పవర్, క్రాక్’ వంటి హిట్స్‌లో రవితేజ పోలీసాఫీసర్‌గా చేశాడు.ఈ పోలీసాఫీసర్ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నారామో కానీ… రవితేజ మరోసారి ‘మాస్ జాతర’ (Raviteja Massjathara) సినిమా కోసం లాఠీ పట్టాడు. ఖాకీ వేశాడు. పైగా మాస్ జాతరఅనే మూవీ రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
తొలుత మాస్ జాతర సినిమాను ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి రిలీజ్ వాయిదా వేశారు. ఈ తేదీకి కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ వీలు పడకపోవడంతోఆగస్టు 27కి వాయిదా వేశారు. ఆగస్టు 27 అంటే…వినాయకచవితి ఫెస్టివల్ డే. బుధవారం. అంతా బాగుంది కానీ..ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కావడం లేదట. భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నవీన్‌చంద్ర విలన్ రోల్ చేశాడు.
మరోసారి ఎన్టీఆర్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత నాగవంశీ
దీంతో ఈ చిత్రం నిర్మాత నాగవంశీకి, రవితేజకు మధ్య ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదట. నాగవంశీ (Nagavamsi) మాస్ జాతర సినిమా రిలీజ్‌ను వాయిదా వేద్దామంటే..ఇందుకు రవితేజ నో చెబుతున్నారట. మరి..రవితేజ పంతం ఎంతవరకు నెగ్గుకు వస్తుందో చూడాలి.
కానీ ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఆగస్టు 1న విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ (Kingdom) సినిమా రిలీజ్ కానుందట. ఆగస్టు 14న ఎన్టీఆర్-హ్రితిక్‌రోషన్‌ల ‘వార్ 2’ సినిమా రిలీజ్ ఉంది. తెలుగులో నాగవంశీయే రిలీజ్ చేస్తున్నారు. మళ్లీ ఆగస్టు 27న ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ అంటే…థియేటర్స్ పరంగా ఇబ్బందులు రావొచ్చు. పైగా ఆగస్టు 14న రజనీకాంత్-నాగార్జునల ‘కూలీ’ సినిమా కూడ ఉంది.
కింగ్‌డమ్, కూలీ, వార్ 2 సినిమాల మధ్య మాస్ జాతరకు సినిమాకు థియేటర్స్‌కు దొరకడం అనేది కాస్త ఇబ్బందికర అంశమే మనే చెప్పుకోవాలి. పైగా విజయ్‌దేవరకొండ కింగ్‌డమ్, రవితేజ మాస్ జాతర చిత్రాలు నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. కూలీ కూడా నెట్‌ప్లిక్స్ అనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ జాతర సినిమా రిలీజ్‌కు ఓటీటీల పరంగా కూడా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరోవైపు రవితేజ మాత్రం ఆగస్టు 27న వస్తే..సోలో రిలీజ్‌గా బాగుంటుందని, వినాయకచవితి హాలీడేస్‌ని క్యాష్ చేసుకోవచ్చని భావిస్తున్నారట. మరి..మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ అవుతుందా? రవితేజ పంతం నెగ్గుతుందా? వేచి చూద్దాం.