KantaraChapter1 TeluguTrailer: బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాఫ్టర్1’ ( KantaraChapter1 ) చిత్రం ఈ అక్టోబరు 2న ( KantaraChapter1 Telugu Release date) థియే టర్స్‌లో రిలీజ్ కానుంది. ‘కాంతార’ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్‌శెట్టి (Kantarahero Rishabshetty), ‘కాంతార’ ప్రీక్వెల్ ‘కాంతార:ఛాప్టర్ 1’కూ కూడా దర్శకత్వం వహించి, హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నాం విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను హోంబలే ఫిలింస్ సంస్థ విడుదల చేయగా, తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తీకేయన్, మలయాళ ట్రైలర్‌ను పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు విడు దల చేశారు. తెలుగు ట్రైలర్‌లోని డైలాగ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
‘నాన్న ఇక్కడే ఎందుకు మాయం అయ్యాడు…’,
‘అదో పెద్ద దంత కథ…’, ‘ఏంటా దంత కథ…’,
‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో, ధర్మాన్ని కపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు
ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది…ఈ పుణ్యభూమిలో…’
రావడం కొంచెం ఆలస్యమైంది..రా….!
కాంతార లోపలికి అస్సలు వెళ్లకూడదు పిల్లలు…
అక్కడ బ్రహ్మారాక్షసుడు ఉన్నాడు
ఇక మనకు దక్కినదాంట్లో మూడోవాటా హద్దు దగ్గర ఏట్టేదే లేదు
కాంతార వాళ్లు మన బందరులో వ్యాపారానికి దిగారు
బాంగ్రాకు ఎవరు తీసుకువచ్చారు మిమ్మల్ని
మమ్మల్ని చూడటానికి మీరు వచ్చారు.. మిమ్మల్ని చూడటానికి మేం రాకూడదా!
యువరాణితో కలిసి తిరుగుతుండటం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చొనేలానే కనిపిస్తున్నాడు
వంశానికి అంటిన కళంకాన్ని కాంతార వాళ్ల రక్తంతో కడిగేస్తా…!
మంటల్ని బంధించి ఆపెదెవ్వడు..!
ఈశ్వర దేవుడు ఇక్కడికి వచ్చాడా…? ఈడికి రావడమే కాదు..ఆయన వెలిసింది ఈడనే..!
ఇప్పుడు కూడా ఉన్నారా?
డబ్బింగ్ సినిమా కాంతార చాప్టర్1కు తెలుగులో సోలో రిలీజ్
ఇడ్లీలు వేయడానికే పుట్టాననిపిస్తోంది…!.. ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదల
‘నాన్న ఇక్కడే ఎందుకు మాయం అయ్యాడు’ అనే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ‘కాంతార చాప్టర్1’ ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సినిమా విజువల్స్ అత్యధ్భుతంగా ఉన్నాయి. అజనీష్ లోకనాథ్ మరోసారి తన సూపర్భ్ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. క్వీన్‌గా రుక్మీణీ వసంత్ బాగా కుదిరారు. పోరాటయోథుడిగా, నాయకుడిగా రిషబ్‌శెట్టి సూపర్భ్‌గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్‌తో ‘కాంతార చాప్టర్ 1’ ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ సినిమాకు పోటీగా వచ్చి, రూ. 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్1’ సినిమా వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కాంతారఛాప్టర్1’ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.