Roshan Champion Movie: క్రిస్మస్ ఫెస్టివల్‌కు ‘చాంపియన్’గా థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధమైయ్యాడు రోషన్. ప్రముఖ తెలుగు హీరో రోషన్ నటిస్తున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండా, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్నా సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబరు 25న (Roshan Champion Movie Release date) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించి, ఈ సినిమా నుంచి రోషన్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనశ్వర రాజన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
భారతదేశ స్వాంతంత్య్రానికి పూర్వం, బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో రోషన్ ఓ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఈ రోల్ కోసం రోషన్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. అంతేకాదు..ఈ సినిమా బడ్జెట్ దాదాపు 30 కోట్ల రూపాయల వరకు అయ్యిందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఓ అప్‌కమింగ్ హీరోకు ఈ రేంజ్ బడ్జెట్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మాములు విషయం కాదు. మరి.. బాక్సాఫీస్ వద్ద ‘చాంపియన్’ విన్ అవుతాడా? లేదా అనేది చూడాలి.