ఒక రోజు ఆలస్యంగా మోగ్లీ 2025

Viswa

Web Stories

Mowgli 2025 Release: రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ సినిమా ‘మోగ్లీ 2025’. ఈ చిత్రంలో వైవా హర్ష, బండి సరోజ్‌ కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిం చారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 12న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా డిసెంబరు 12కి షెడ్యూల్‌ అయిన నేపథ్యంలో, ‘మోగ్లీ 2025’ సినిమా రిలీజ్‌ వాయిదా పడుతుందెమోనన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రంయూనిట్‌ కేవలం ఒక రోజు ఆలస్యంగానే, అంటే..డిసెంబరు 13న మోగ్లీ 2025 సినిమా విడుదల కానుంది. పైగా డిసెంబరు 12నే ప్రీమియర్‌ షోలు వేయనున్నట్లుగా, మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీకి ‘కలర్‌ఫోటో’ ఫేమ్‌ సందీప్‌రాజ్‌ దర్శకత్వం వహించగా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos