Sambarala Yetigattu Update: సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu). రాయలసీమ నేపథ్యంతో సాగే యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘హను-మాన్’ ఫేమ్ నిరంజన్‌రెడ్డి, కె.చైతన్య ఈ సినిమాకు నిర్మాతలు. (Sambarala Yetigattu cast and crew) ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సంజయ్‌దత్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు (Sambarala Yetigattu Cast and crew).
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు నెల రోజులకుపైగా సాగే ఈ షూట్ షెడ్యూల్‌లో సాయిధరమ్‌తేజ్‌తో పాటుగా, కీలక తారాగాణం అంతా పాల్గొంటున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ తాలుకూ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల కోసమే మేకర్స్ దాదాపు రూ. 20 కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను కెవిన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ముఖ్యంగా సాయిధరమ్‌తేజ్-సంజయ్‌దత్ కాంబినేషన్‌లోని సీన్స్‌ను చిత్రీకరించాని తెలిసింది.
గత ఏడాది సెప్టెంబరు 25నే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇంకా ఈ సినిమా రిలీజ్‌డేట్‌పై స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
сейф встраиваемый купить
В зависимости от состояния пациента мы предлагаем два формата помощи: выезд нарколога на дом или госпитализацию в стационар. Оба варианта включают детоксикацию — выведение токсинов из организма с помощью инфузионной терапии (капельницы), а также медикаментозную поддержку: успокоительные, витамины, препараты для печени и сердца.
Детальнее – вывод из запоя цена