ఇంకా నటీనటులును గురించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ..హిందీ ‘రామాయణ’పై భారీ అంచనాలే ఉన్నాయి. నమిత్ మల్హోత్రా, కేజీఎఫ్ యశ్‌లు కలిసి హిందీ ‘రామాయణ (Ramayanamovie)’ సినిమాను నిర్మి స్తున్నారు. రాముడిగా రణ్‌బీర్‌కపూర్ (Ranbirkapoor), సీతగా సాయిపల్లవి (SaipallaviinhindiRamayana) కనిపిస్తారు.
సీత పాత్రకు సాయిపల్లవిని ఫైనలైజ్ చేయడం వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు తెలుస్తోంది. సీత పాత్రకోసం ఆలియాభట్ (Aliabhhatt), సాయిపల్లవి, శ్రీనిధిశెట్టి…లను ఆడిషన్ చేశారు దర్శకుడు నితీష్ తివారి. ఆలియాభట్‌ను ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. కాకపోతే….రియల్‌లైఫ్‌లో నిజమైన భార్యభర్తలు అయిన..రణ్‌బీర్‌కపూర్, ఆలి యా భట్‌లు…స్క్రీన్‌పై కూడా రాముడు–సీతగా కనిపించడం ఆల్మోస్ట్ ఖరారైపోయింది. కాకపోతే..ఇక్కడే చిన్న ట్విస్ట్ జరిగింది.
బ్రహ్మాస్త్ర సినిమా కోసం ఆల్రెడీ ఆలియాభట్–రణ్‌బీర్‌కపూర్ జంటగా యాక్ట్ చేశారు.ఈ సినిమా సమ యంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. బ్రహ్మాస్త్ర సినిమాలో జంటగా కనిపించిన ఆలియాభట్–రణ్‌బీర్ కపూర్‌లు మళ్లీ వెంటనే..జంటగా అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించారు. పైగా… ‘రామాయణ’ సినిమా తొలిపార్ట్ సమయానికి ఆలియాభట్ గర్భిణి అంట. సో..అలా హిందీ రామాయణ సినిమాలో సీతగా ఆలియాభట్ చేయలేకపోయారు.
‘కేజీఎఫ్’లో యశ్, శ్రీనిధిశెట్టి జంటగా చేశారు. రామాయణ మూవీలో రావణుడిగా యశ్ (Yash) చేస్తున్నాడు. అలాంటప్పుడు సీతగా శ్రీనిధిశెట్టి అయితే…కరెక్ట్ కాదెమో అని ఆలోచిం చారట మేకర్స్. ఒక సినిమాలో జోడీగా చేసి, రామాయణ వంటి ఇతిహాస మూవీలో…సీతగా శ్రీనిధిశెట్టిని, రావణుడిగా యశ్‌ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని మేకర్స్ ఆలోచించి ఉంటారు.
ఇలా ఫైనల్‌గా బాలీవుడ్ ‘రామాయణ’ మూవీలో సాయిపల్లవి ఫైనల్ అయ్యారు. సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది సౌత్‌లో. ‘అమరన్’ మూవీతో ఇంకా పెరిగింది. నార్త్‌లోనూ గుర్తింపు వచ్చింది. ఒక కేజీఎఫ్‌తో యశ్ స్టార్ అయిపోయాడు. నార్త్‌లో రణ్‌బీర్‌కపూర్…సౌత్ నుంచి యశ్…సాయిపల్లవి…ఇలా మార్కెట్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయినట్లే కదా.
ఇక హిందీ రామాయణ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం ఆపైవచ్చే దీపావళికి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ‘రామాయణ’ సినిమా తొలిభాగం చిత్రీకరణ పూర్త యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తుంది.