హీరో, హీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి, అన్ని ఇండస్ట్రీలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో తనకంటే పాతిక సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న భాగ్య శ్రీ భోర్సేతో రవితేజ యాక్ట్ చేయ డాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ‘డాకు మహారాజ్’ మూవీలో ఊర్వశీ రౌతెలాతో బాలకృష్ణ స్టెప్పులను తప్పుపడుతూ, ఏజ్ గ్యాప్ ప్రస్తావన తీసుకొచ్చారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రస్తావనే హిందీ లోనూ వచ్చింది.
సల్మాన్‌ఖాన్, రష్మికా మందన్నా(Rashmika) హిందీలో ‘సికందర్’ (Sikandar) అనే మూవీ చేశారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఈ మార్చి 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్ ఇతరకీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. సాజిత్ నడియాడ్‌వాలా నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో ‘మీ కన్నా 31 సంవత్సరాలు తక్కువగా ఉన్నా…హీరోయిన్‌తో మీరు ఎలా యాక్ట్ చేశారు?’ అనే ప్రశ్న సల్మాన్‌ఖాన్ (Salmankhan) కు ఎదురైంది. ఈ విషయంపై సల్మాన్‌ఖాన్ రెస్సాండ్ అయ్యారు.
‘ఏజ్ గ్యాప్ విషయంలో హీరోయిన్‌కు ఏ సమస్యలా లేదు. హీరోయిన్ తల్లీదండ్రులకు ఏ సమస్య లేదు. మీకు ఏంటి సమస్యా..ఏజ్ గ్యాప్ ఉన్నా…హీరోయిన్‌తోనే కాదు…ఆ హీరోయిన్‌కు వివాహం జరిగి, ఆమెకు ఓ కూతరు జన్మించి, ఆ అమ్మాయి సినిమాల్లోకి వస్తే…ఆ అమ్మాయితో కూడా నేను యాక్ట్ చేస్తాను. వాళ్ల అమ్మ పరిష్మన్ తీసుకుంటాను’’ అని సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్నాయి.