Samantha Ruth Prabhu marries Raj Nidimoru: హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu Marriage ) వివాహం చేసుకున్నారు. ఈ సోమవారం తెల్లవారు జామున కోయం బత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో సమంత, రాజ్ నిడుమోరు (Raj Nidimoru )ల వివాహం జరిగింది. లింగభైరవి దేవాలయంలో రాజ్, సమంతలు భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. యోగ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. భావోద్వేగాలు, ఆలోచనలు, భౌతికతకు అతీతంగా …దంపతుల మధ్య లోతైన వివాహ బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ట ప్రక్రియే ఈ ‘భూతశుద్ధి వివాహం’ అంటూ ఈశా ఫౌండేషన్ ఓ లేఖలో పేర్కొంది. అలాగే సోషల్‌మీడియా వేదికగా సమంత తన వివాహాన్ని కన్ఫార్మ్ చేస్తూ, వివాహంలోని ఫోటోలను షేర్ చేశారు.
దర్శక–నిర్మాత రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నారనే వార్త లు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలకు తోడు రాజ్‌తో సమంత కలిసి ఉన్న ఫోటోలు కూడ సోషల్‌మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఎయిర్‌పోర్ట్ లోకేషన్స్‌లోకూడ సమంత, రాజ్‌లు పలుమార్లు ఒకేసారి కనిపించారు.
వీటికి తోడు సమంత యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటిబంగారం’ సినిమాకు రాజ్ నిడు మోరు ఓ నిర్మాతగా ఉన్నారు. అలాగే సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’కు కూడా రాజ్ నిడుమోరు ఓ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇంకా…‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ సిని మాకు రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత ఓ లీడ్ రోల్ చేశారు. ఈ సిరీస్ సమయంలో సమంత, రాజ్‌ల మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ తర్వాతి కాలం లో వీరి స్నేహాం ప్రేమగా మారిందని తెలుస్తోంది.

