కథ
Samuthirakani RamamRaghavam Review: దశరథరామం (సముద్రఖని) సబ్‌రిజిస్టార్ ఆఫీస్‌లో నిజాయితీగా పనిచేసే ఉద్యోగి. దశరథరామం కొడుకు రాఘవం (ధన్‌రాజ్). తన కొడుకు రాఘవ జీవితంలో ప్రయోజకుడు అవ్వాలని దశరఘరామం ఆశపడు తుంటాడు. కానీ రాఘవది షార్ట్‌కట్‌లో మనీ సంపాదించాలనుకునే వ్యక్తిత్తం. జీవితంలో నిజాయితీగా కష్ట పడి ఎదగాలనే దశరథరామంకు, జీవితంలో ఎదిగాలంటే నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదన్న రాఘవం మధ్య అభిప్రాయబేధాలు వస్తాయి. ఈ క్రమంతో అబద్దాలు చెప్పి రాఘవ సెట్ చేసుకున్న ఓ పెళ్లి సంబంధాన్ని దశరథరామం క్యాన్సిల్ అయ్యేలా చేసి, ఆ అమ్మాయికి మరో సంబంధం చూస్తాడు. అలాగే తన సంతకాన్ని పోర్జరీ చేశాడనే కోపంతో కొడుకును పోలీసులకు పట్టిస్తాడు. దీంతో తండ్రిపై బాగా కోపం పెంచుకుంటాడు రాఘవం. ఈ క్రమంలో తన మిత్రుడైన దేవ (హరీష్‌ఉత్తమన్)తో కలిసి తండ్రికి హత్య చేయించి, తండ్రి ఆస్తి–ఉద్యోగం కాజేయాలని రాఘవ ప్లాన్ చేస్తాడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? అనుకున్నట్లుగానే రాఘవ తండ్రిని హత్య చేయించాడా? రాఘవలో ఏమైనా మార్పు వచ్చిందా? తన కొడుకే తనను హత్య చేయించాలనుకుంటున్నాడన్న నిజం దశరథరామంకు తెలుస్తుందా? అనేది సినిమాలో చూడాలి (Samuthirakani RamamRaghavam Review)
విశ్లేషణ
విభిన్నమనస్తత్వాలు ఉన్న తండ్రీకొడుకుల ఎమోషనల్ డ్రామా సినిమా. ఈ మూవీలో ధన్‌రాజ్ యా క్టింగ్ చేయడంతో పాటుగా, దర్శకత్వం . సినిమా స్టార్ట్ కావడంతోనే ధన్‌రాజ్ పాత్ర నెగటివ్ షేడ్స్ అని తెలిసిపోతుంది. కానీ ఈ నెగటివ్ షేడ్స్‌ను ఇంకాస్త బలంగా చూపించాలని ఎక్కువ సీన్స్ రాసుకోడం బాగోలేదు. ఫస్ట్ హాఫ్‌లోనే అనుకుంటే, సెకండాఫ్‌లోనూ ఈ ధోరణీ కొనసాగుతుంది. కానీ సెకం డాఫ్‌లో వచ్చే ఓ చిన్నపాటి ట్విస్ట్ ఫర్వాలేదనిపించినా, ఊహకుతగ్గ క్లైమాక్స్ ఆడియన్స్‌ను నిరాశపరుస్తుంది. సినిమా మేజర్‌గా సముద్రఖని–ధన్‌రాజ్‌ల కాంబినేషన్ సీన్స్‌తో ఉంటుంది. కానీ వీరద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ తక్కువ. ధన్‌రాజ్ మాట్లాడుతుంటే…సముద్రఖని పక్కన ఎక్కడో ఉంటూ, వింటూ రిప్లై ఇస్తాడు.
ధన్‌రాజ్ డైలాగ్స్ చెబుతుంటే సముద్రఖని వింటు ఉంటాడు. మధ్యలో ప్రమోదిని క్యారెక్టర్ పోస్ట్‌మేన్‌లా ఉంటుంది. ఇలా కాకుండ ఐ టు ఐ కాంటాక్ట్ సీన్స్ ఉంటే సినిమా మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. కమేడియన్ సత్యతో ఇంకాస్త కామెడీ ట్రాక్ ఏదైనా ట్రై చేయాల్సింది. ఈ సినిమాలో హీరోకి లవ్ ట్రాక్ ఉన్నా లేకున్నా ఒకటే. ఏదో బలవతంగా ఇరికించినట్లుగా ఉంది. కొన్ని సీన్స్‌లో దర్శకుడికి ధన్‌రాజ్ అనుభవలేమీ కనిపిస్తుంది. కానీ ఉన్నంతో ధన్‌రాజ్ దర్శకుడిగా మంచి ప్రయత్నం అయితే చేశాడు.
పెర్ఫార్మెన్స్‌లు
ఈ సినిమాకు ప్రధానబలం సముద్రఖని. ఆయన చాలా సెటిల్డ్‌గా, ఎమోషనల్‌గా యాక్ట్ చేశాడు సముద్ర ఖని. కొడుకు భవిష్యత్ గురించి మదనపడే తండ్రిగా కొన్ని సీన్స్‌లో సముద్రఖని యాక్టింగ్ కట్టిపడేస్తుంది. యాక్టర్‌గా ధన్‌రాజ్‌ను కొత్తగా చూస్తారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో బాగానే చేశాడు. కానీ కొన్ని సీన్స్‌లో మరింత ఎఫెక్టివ్ యాక్టింగ్ ఉండాల్సింది. అంటే రోల్ అలాంటిది. హీరో ఫ్రెండ్ అంజిగా, సత్య క్యారెక్టర్ అలా వచ్చివె ళ్తుం టుంది. ధన్‌రాజ్ ప్రేమించే అమ్మాయి వర్షగా మోక్ష ఓ గెస్ట్ రోల్ అన్నట్లుగా ఉంటుంది. ఫైనాన్షియర్‌గా సునీల్, లారీ డ్రైవర్ దేవగా హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్స్ బలంగా స్టారై్ట,ఆ తర్వాత మెల్లిగా సైలెంట్ అయిపోతాయి. పేకాట క్లబ్‌గా ఓనర్‌గా శ్రీనివాసరెడ్డి, సముద్రఖణి కోలిగ్ కాశీగా 30 ఇయర్స్ పృధ్వీ వారి పాత్రల మేరకు చేశారు. కథలో ఎమోషన్ ఉన్నా…కథనంలో బలం లేదు. డ్రామా తక్కువైంది. రోటీన్ స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. అరుణ్ సంగీతం ఒకే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు, విజువల్స్ ఒకే.
బాటమ్‌లైన్: రామం రాఘవం… కథలో ఎమోషన్ ఉంది. కానీ కథ రోటీన్‌గా ఉంది
రేటింగ్: 2.25 /5
Dhanush JabilammaNeekuAnthaKopama Movie Review: జాబిలమ్మా నీకు అంత కోపమా..రివ్యూ