Raakasa Pre Release: సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటించిన ఫ్యాంటసీ కామెడీ సినిమా ‘రాకాస’. దర్శకురాలు మానస శర్మ (Raakasa Movie Director) తెరకెక్కించిన ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 3న (Raakasa Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్.
ఈ వేడుకలో సంగీత్శోభన్ మాట్లాడుతూ-”రాకాస’ రూపంలో మేం ఒక మంచి సినిమా తీశాం. ఆడియన్స్‌ను రాకాస సినిమా నిరాశపరచదు. ప్రేక్ష కులు మా సినిమాకు ఖర్చు చేసే ప్రతి రూపాయికి, తగ్గ న్యాయం వారి వినోదం రూపంలో థియేటర్స్‌లో లభిస్తుందని నమ్మకంగా చెప్పగలను. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి నిహారికగారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌సిరీస్ నుంచే నాకు మానసగారితో మంచి అనుబంధం ఉంది. నయన్సారిక మంచి ప్రతిభావంతురాలు. ఈ నెల 3న ప్రేక్షకులు, మా ‘రాకాస’ సినిమాతో పాటుగా, శర్వా అన్న ‘బైకర్’ సినిమాను కూడ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ నయన్సారిక మాట్లాడుతూ-”మా నిర్మాణసంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇది నా మూడో సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది” అని చెప్పారు.

నిర్మాత-నటి నిహారిక కొణిదెల మాట్లాడుతూ-”కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…ఈ రెండు కుటుంబాలు నాకు సమానమే. నాపై నమ్మకం ఉంచిన మా పేరెంట్స్‌కు ధన్యవాదాలు. నిజాయితీతో వందశాతం కష్టపడి, మేం ఒక మంచి సినిమా చేశాం. సంగీత్ షైనింగ్ స్టార్. ఈ సినిమా విజయంలో సంగీత్కి సింహాభాగం దక్కుతుంది. మానసగారు తక్కువ మాట్లాడతారు. కానీ సినిమాల గురించి ఎక్కవ ఆలోచిస్తుంటారు. ఆమె ఇండస్ట్రీలో మరింత స్థాయికి ఎదుగుతారు. నయన్సారిక టాలెంటెడ్. గెటప్శ్రీనుగారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ‘కమిటీకుర్రాళ్ళు’ సినిమా సమయంలో, కొత్త వాళ్లతో సినిమా ఎందుకు? అన్నారు. రాకాస సినిమా చేస్తుంటే…ఈ తరహా సినిమాలు ఎందుకు అన్నారు. అన్నయ్య వరుణ్‌తేజ్‌తో ‘బరి’ సినిమాకు చేస్తుంటే..ఫ్యామిలీ మెంబర్స్‌తో సినిమా ఎందుకు? అంటున్నారు. అనేవాళ్లు అంటూనే ఉన్నారు. నేను చేయాల్సింది చేస్తూనే ఉంటాను. మా పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో పని చేసిన ప్రతి ఒక్కరికీ, సొంత ఇల్లు, కారు ఉండాలి. కుటుంబంతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేసేలా ఉండాలి. ఇదే నా లక్ష్యం. ‘రాకాస’ సినిమా పూర్తి వినోదభరితంగా ఉంటుంది. థియేటర్స్‌లో చూడండి” అన్నారు.
దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ-”నిహారికగారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పింక్ ఎలిఫెంట్ పిక్చర్లో సిరీస్‌ను డైరెక్ట్ చేస్తే, ఆ వెంటనే ‘రాకాస’లాంటి ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం లభించింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, జీ స్టూడియోస్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య విజయ్, మైత్రీమూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశి, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి, డీఓపీ రాజు ఎదురోలు, ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ మురళీ మనోహర్ ,ఫైట్ మాస్టర్ విజయ్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి,లిరిక్ రైటర్ రఘు రాం, మహేష్ ఉప్పాల, కమిటీకుర్రాళ్ళు సినిమా దర్శకుడు యదువంశీ మాట్లాడారు