వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో వస్తున్న థర్డ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (SankranthikiVasthunnam) చిత్రంపై కూడా అంచనాలు ఉన్నాయి. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఓ బిగ్‌షాట్ కిడ్నాప్ అవ్వడం, ఈ కిడ్నాప్ వల్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులు రావడం, కిడ్నాప్ అయిన వ్యక్తిని కాపాడే ఆపరేషన్‌ను ఓ మఫ్తీలో ఉన్న ఓ పోలీసాఫీసర్ చేతికి రావడం, ఈ ఆపరేషన్‌లో ఆ పోలీస్ ఆఫీసర్ మాజీ ప్రేయసి ఉండటం, దీంతో పోలీసాఫీసర్, అతని మాజీ ప్రేయ సిలతో కలిసి ఆ కిడ్నాప్ ఆపరేషన్‌లో పోలీసాఫీసర్ భార్య కూడా భాగం కావడం జరగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేష్, అతని మాజీ ప్రేయసి కమ్ పోలీసాఫీసర్‌గా మీనాక్షీ చౌదరి, వెంకటేష్ భార్యగా ఐశ్వర్యారాజేష్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజకీయ నాయకులుగా వీటీవీ గణేష్, సీనియర్ నరేశ్‌లు కనిపిస్తారని తెలుస్తోంది.
Vishal: విశాల్‌కు ఏమైంది..? మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు?
ట్రైలర్ అయితే అనిల్‌రావిపూడి మార్క్‌కు తగ్గట్లుగా కాస్త ఫన్‌గానే ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా సెకండాఫ్ కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఆ కిడ్నాప్ సస్పెన్స్ డ్రామా ఆడియన్స్‌కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్నదే కీలకం.
Nandamuri Balakrishna Daaku Maharaaj: డాకుమహారాజ్…జంగిల్ కింగ్
Gamechanger Story:గేమ్‌చేంజర్ ట్రైలర్ రిలీజ్…స్టోరీ ఇదేనా?