Sharwa Bhogi Movie Release: ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘భోగి’ (Bhogi Movie). ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు సంపద్‌నంది డైరెక్టర్. అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా ‘భోగి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘భోగి’ సినిమాను ఆగస్టు 28న (Bhogi Movie Release) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపి, ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
1960 నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంతో కథనం సాగతుంది. ప్యూర్ రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా తీస్తున్నారు సంపద్‌నంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ భోగి సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తీస్తారు. దిలీప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను తీస్తున్నారు. ‘భోగి’ సినిమా కోసం శర్వానంద్ కొత్తగా మేకోవర్ అయ్యాడు. యాక్షన్ లుక్‌లో కనిపిస్తారు. శర్వానంద్ ఈ సినిమాలో గంగ అనే పాత్రలో నటిస్తున్నారు ఆయన.
మరోవైపు నాని హీరోగా చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ది ప్యారడైజ్’ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజైన వారం రోజుల తర్వాతనే, భోగి సినిమా విడుదలకు సిద్ధం అవుతుండటం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందులోనూ ఈ రెండు చిత్రాలూ యాక్షన్ సినిమాలే కావడం మరో ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు.

Эта статья сочетает познавательный и занимательный контент, что делает ее идеальной для любителей глубоких исследований. Мы рассмотрим увлекательные аспекты различных тем и предоставим вам новые знания, которые могут оказаться полезными в будущем.
Ознакомиться с теоретической базой – https://haptonomie.com/haptonomie-in-prenatal-care