శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘బైకర్’ (Biker). ఇందులో మోటర్‌బైక్ రేసర్‌గా శర్వానంద్ (Sharwa) యాక్ట్ చేశాడు. లేటెస్ట్‌గా ‘బైకర్ ఫస్ట్ ల్యాప్’ అంటూ..ఈ ‘బైకర్’ సినిమా టీజర్‌ను (Sharwa biker Movie Teaser)రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఓ కథ ఉంటుంది…’
‘సమయంతో పోరాడే కథ..’,
‘చావుకు ఎదురెళ్లే కథ…’,
‘ఏం జరిగిన పట్టువదలని మొండోళ్ళ కథ…’,
‘గెలవడం గొప్ప కాదు…చివరి వరకు పోరాడటం గొప్ప….’
ఈ తరహా డైలాగ్స్‌తో ఈ ‘బైకర్’ సినిమా ఫస్ట్ ల్యాప్ ఆసక్తికరంగానే ఉంది. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి.
తాజా ‘బైకర్ ఫస్ట్ ల్యాప్’ వీడియోతో పాటుగా, ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రక టించారు. ‘బైకర్’ సినిమా డిసెంబరు 6న (Biker Movie R థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అంటే..బాలకృష్ణ ‘అఖండ2: తాండవం’ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు అన్నమాట. ఇలా బాక్సాఫీస్ పోటీకి సై అన్నారు శర్వానంద్.
‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘అఖండ2 తాండవం’పై ఇండస్ట్రీలో అంచనాలు ఉండటం సహజం. ఈ తరు ణంలో బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ పోటీకి దిగడం ఆశ్చర్యకరమే. పైగా ‘బైకర్’ స్పోర్ట్స్ డ్రామా. ఏమాత్రం రోటీన్‌గా ఉన్నా, బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టొచ్చు. అయితే ‘బైకర్’ మూవీ తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందని శర్వానంద్ చెబుతుండటం, దర్శకుడు అభిలాస్ కంకర కూడా ఈ ‘బైకర్’ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
శర్వానంద్ హీరోగా నటించిన ఈ ‘బైకర్’ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా, వంశీ-ప్రమోద్‌లు నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం జిబ్రాన్.