please subscribe to Tollywoodhub YouTube channel

మహిళలపై చేసిన వ్యాఖ్యలపై శివాజీ వివరణ – “అలా మాట్లాడకూడదు”

Kumar NA
1 Min Read

Web Stories

Shivaji Clarifies His Remarks on Women: ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు శివాజీ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందించారు. ఒక సినిమా ప్రమోషన్ సమయంలో మహిళల డ్రెస్సింగ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు.

మహిళలు ఏ దుస్తులు వేసుకున్నారనే కారణంతో వారి స్వభావాన్ని నిర్ణయించడం తప్పు అని శివాజీ చెప్పారు. తాను చెప్పాలనుకున్న విషయం వేరే అయినా, ఆ సమయంలో రెండు పదాలు ఉపయోగించకపోతే బాగుండేదని అన్నారు. ఆ మాటలు ఎందుకు అలా వచ్చాయో తనకే అర్థం కాలేదన్నారు. తర్వాత ఆ వీడియో చూసినప్పుడు “నేనే ఇలా మాట్లాడానా?” అని తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు.

ఆ సంఘటన తర్వాత తనకు చాలా బాధ కలిగిందని, మూడు రోజుల పాటు నిద్ర కూడా పోలేదని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో ప్రెస్ మీట్లు, డిబేట్లలో మాట్లాడినా ఎప్పుడూ ఇలా తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పారు. మహిళలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. మహిళా కమిషన్‌కు తనపై ఫిర్యాదు చేసిన వారు తనకు తెలిసిన వారే అని తెలిసి షాక్ అయ్యానన్నారు. అయినప్పటికీ వారి పేర్లు చెప్పడం సరికాదని, ఇప్పటికీ వారికి గౌరవమే ఉందని శివాజీ తెలిపారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi