Aasmaan Movie : ప్రముఖ దివంగత నటులు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఆస్మాన్’ ( Aasmaan Movie )అనే టైటిల్ ఖరారైంది. రామ్ నందన్ దర్శకత్వంలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ పతాకంపై కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సస్పెన్స్ డ్రివెన్ మైథలాజికల్ సినిమా శని వారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సినిమా ప్రారంభోత్సవంలో సాయిదుర్గా తేజ్ , సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గా తేజ్ క్లాప్ ఇవ్వగా, సందీప్ కిషన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.

అనంతరం మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ– ‘‘ఓ అద్భుతమైన కథతో ‘ఆస్మాన్’ సినిమా తీస్తున్నాం. మేం బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాగా ‘ఆస్మాన్’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చెప్పారు రామ్‌నందన్. ‘‘మా ప్రొడక్షన్‌లో మేఘాంశ్ శ్రీహరిగారితో తొలి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఓ అద్భుతమైన కథతో రామ్‌నందన్‌గారు ‘ఆస్మాన్’ సినిమా కథను అందించారు. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు నిర్మాతలు వెంకటేష్ కొండారు. కెమెరా షోయభ్ మాట్లాడారు.
Этот обзор предлагает структурированное изложение информации по актуальным вопросам. Материал подан так, чтобы даже новичок мог быстро освоиться в теме и начать использовать полученные знания в практике.
Прочесть заключение эксперта – https://oxerp.asia/product/%E6%B2%B3%E5%93%A5%E6%B5%B7%E5%91%B3-%E7%B2%BE%E9%81%B8%E6%8C%AA%E5%A8%8170%E9%A0%AD%E9%B1%88%E9%AD%9A%E8%8A%B1%E8%86%A0%E7%89%87-1%E6%96%A4-605g