సిద్దుజొన్నలగడ్డ స్పై డ్రామా జాక్‌ రివ్యూ

Siddhu Jonnalagadda Jack Review: డీజేటిల్లు ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డ, 'బేబీ' హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో వచ్చిన స్పై డ్రామా జాక్‌ రివ్యూ

Viswa
4 Min Read
Jack Movie Telugu Review

సినిమా: జాక్‌ (Siddhu Jonnalagadda Jack Review)
ప్రధానతారాగణం: సిద్దు జొన్నలగడ్డ, ప్రకాష్‌రాజ్, వైష్ణవీ చైతన్య, సీనియర్‌ నరేశ్, సుబ్బరాజ్‌
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌
నిర్మాణం: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు
సంగీతం: అచ్చురాజమణి, సామ్‌సీఎస్‌ (ఆర్‌ఆర్‌)
కెమెరా: విజయ్‌ కె చక్రవర్తి
ఎడిటర్‌: నవీన్‌నూలి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 10, 2025

 

ఫ్యాబ్లో నెరోడా ఆలియాస్‌ జాక్‌ (సిద్దు జొన్నలగడ్డ) ఇండియా రా (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ కావాలనుకుంటాడు. దేశం కోసం ‘రా’ ఏజెంట్స్‌లా తానూ సేవ చేయాలనుకుంటాడు. ‘రా’ ఏజెంట్‌ కాకుం డానే..తనకు తానుగా ‘మిషన్‌ బటర్‌ఫ్లై’ అనే మిషన్‌ను స్టార్ట్‌ చేసుకుంటాడు. ఈ మిషన్‌కు అక్కడి లోకల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ (సుబ్బరాజు)ను ఇన్‌వాల్వ్‌ చేస్తాడు. జాక్‌ ఓ స్కెచ్‌ వేసి, ప్రదీప్‌ సాయంతో ఉగ్ర వాదులు షఫీ, మనోజ్‌లను కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. అయితే షఫీ నిజమైన ఉగ్రవాది కాగా… మనోజ్‌ (ప్రకాష్‌రాజ్‌) మాత్రం ‘రా’ ఆఫీసర్‌. ఉగ్రవాది సంస్థ ఆల్‌ ముజాహిద్దీన్‌ సంస్థ చీఫ్‌ అథావుల్‌ రెహమాన్‌ ఇండియాలో ప్లాన్‌ చేసిన బ్లాస్ట్‌లను అడ్డుకోవాలని, ‘ఆపరేషన్‌ రెడ్‌ థండర్‌’ పేరుతో..ఓ మిషన్‌ చేస్తుంటాడు మనోజ్‌. మరి..జాక్‌ కంట్రోల్‌ నుంచి మనోజ్‌ను ఎవరు తప్పించారు? మనోజ్‌ గురించి జాక్‌కు నిజం తెలి సిన తర్వాత ఏం జరిగింది? మనోజ్, జాక్‌లు అసలు నేపాల్‌ ఎందుకు వెళ్లారు? జాక్‌ ఫైనల్‌గా ‘రా’ ఏజెంట్‌ అయ్యాడా? అనేది సినిమాలో చూడాలి.

ఇండియన్‌ స్పై డ్రామాలు చాలానే వచ్చాయి. గత ఐదేళ్లలో సక్సెస్‌ఫుల్‌ స్పై మూవీస్‌ అంటే..తెలుగు ప్రేక్ష కులకు దగ్గరగా అర్థమయ్యేలా అడివి శేష్‌ ‘గూఢచారి’, కార్తీ ‘సర్దార్‌’ సినిమాలను గుర్తు తెచ్చుకోవచ్చు. ఫెయిల్యూర్‌ స్పై డ్రామా అంటే…అఖిల్‌ ‘ఏజెంట్‌’ను గుర్తు తెచ్చుకోవచ్చు. ‘జాక్‌’ కూడా అంతే మరో ఫెయి ల్యూర్‌ ‘రా’ ఏజెంట్‌.

జాక్‌ అసలు..ఎందుకు ‘రా’ ఏజెంట్‌ అవ్వాలనుకుంటున్నాడు? అనే ఎమోషన్‌ స్ట్రాంగ్‌గా ఉండదు (నాగ చైతన్య ‘కస్టడీ’, ఎన్టీఆర్‌ ‘బాద్‌ షా’ ఛాయలు గుర్తుకురావొచ్చు). స్పై డ్రా మాలు…డీజే టిల్లు తర హాలోని క్యారెక్టర్‌ డ్రివెన్‌ ఫిల్మ్స్‌ కాదు..స్పై డ్రామా అంటేనే..చాలా క్యారెక్టర్స్‌ ఇన్‌ వాల్వ్‌ అవుతాయి. ఇక్కడ కూడా డీజే టిల్లు క్యారెక్టర్‌స్టిక్స్‌ అంటే చెల్లుబాటు కాదు.

తనకుతానుగా ఓ స్పై మిషన్‌ను హీరో ప్లాన్‌ చేసుకోవడమే పెద్ద మైనస్‌. ‘రా’ ఆఫీసర్‌ కావాలనుకునే వ్యక్తికి చాలా నాలెడ్జ్‌ ఉంటుంది. కానీ ఈ కథలో..‘రా’లో చాలా క్రియాశీలకంగా ఉన్న మనోజ్‌ లాంటి వ్యక్తి కూడా జాక్‌ తెలుసుకోకపోవడం, అతన్ని కిడ్నాప్‌ చేయడం ఆశ్చర్యకరం.

సినిమా స్టార్టింగ్‌ సీన్స్‌ అన్నీ అఖిల్‌ ‘ఏజెంట్‌’ సినిమానే గుర్తుకు తెస్తాయి. హీరో ఏజెంట్‌ కావాలనుకోవడం, ఆ తర్వాత రిజెక్ట్‌ కావడం, సొంతంగా ఏవో ప్రయత్నాలు చేసి, రా కార్యకలాపాల్లో తల దూర్చడం…వంటి రోటీన్‌ సీన్స్‌ జాక్‌లోనూ దర్శనమిస్తాయి. పాత స్పై డ్రామాల మాదిరిగానే ఈ మూవీ సెకండాఫ్‌ అవుట్‌ డోర్‌ లొకేషన్‌ నేపాల్‌కు షిప్ట్‌ అవుతుంది. అక్కడ మిషన్‌ కంప్లీట్‌ అవుతుంది. దేశభక్తిని చాటే ఒకట్రెండు సీన్స్‌ కూడా ఉండవు. అలాగే స్పై లాంటి ఇంటెన్స్‌ స్టోరీస్‌లో లవ్‌ ట్రాక్‌ను పెట్టడం అంటే..ఆడియన్స్‌ను థియేటర్స్‌లో కూర్చొ మని హైజాక్‌ చేయడమే. క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్రైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్, చిన్నపాటి ట్విస్ట్‌ ఫర్వాలేదు.

డీజేటిల్లులో ఉండే ఎనర్జిటిక్‌ హీరో క్యారెక్టరైజేషన్‌నూ ‘జాక్‌’లో చూపించాడు సిద్దు జొన్నలగడ్డ. మూడ్నా లుగు వన్‌లైనర్స్‌ బాగానే వర్కౌట్‌ అయ్యాయి. కానీ స్పై లాంటి కథలకు కావాల్సినవి ఇవి కాదు. ఈ మూవీ నెక్ట్స్‌ చెప్పుకోవాల్సిన క్యారెక్టర్‌ మనోజ్‌. ఓ పెద్ద రా ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్‌ చేశాడు. ఎప్పట్నాలనే ∙రోటీన్‌ ట్రెడ్‌మార్క్‌ యాక్టింగ్‌ చేశాడు. డిటెక్టివ్‌ ఏజెంట్‌ అఫ్తాబ్‌బేగం ఆలియాస్‌ భానుమతిగా వైష్ణవీచైతన్య కనిపిం
చింది. కథలో పెద్ద ఇంపార్టెన్స్‌ ఉన్న రోల్‌ కాదు. కథలో హీరోయిన్‌ కావాలని, దర్శకుడు పెట్టినట్లుగా ఉంటుంది. హీరో తండ్రిగా సీనియర్‌ నరేశ్, క్యాట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ హెడ్, హీరోయిన్‌ తండ్రి పాన్‌ ఇండియా ప్రసాద్‌గా బ్రహ్మాజీ, రా ఏజెంట్‌ కావాలనుకు ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ రంగనాథ్‌గా సుబ్బరాజు వారి వారి పాత్రల మేరకు చేశారు.

పాత కథను ఎంచుకున్న దర్శకుడు భాస్కర్, కొత్త స్క్రీన్‌ ప్లేను అయినా డిజైన్‌ చేయాల్సింది. అదీ లేదు. ఓ రోటీన్‌ టెంప్లెట్‌ స్టోరీ ఇది. అచ్చురాజమణి సంగీతం, సామ్‌సీఎస్‌ ఆర్‌ఆర్‌లు కూడా ఈ సినిమాకు బలం కాలేకపోయాయి. విజయ్‌.కె. చక్రవర్తి విజువల్స్‌ ఒకే. నిర్మాణవిలువుల బాగానే ఉన్నాయి.

బాటమ్‌లైన్‌…జాక్‌..మరో ఫెయిల్యూర్‌ రా ఏజెంట్‌
రేటింగ్‌ 2/5

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *