Siddu Jonnalagadda Jack: ‘డీజేటిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda )హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘జాక్: కొంచెం క్రాక్ (Jack)’. ‘బొమ్మరిల్లు’ ఈ సినిమాకు దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘బేబీ’ సినిమా ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్ మూవీలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ, నరేష్‌లు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ‘జాక్’ సినిమా ను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
‘జాక్’తో పాటుగా ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఈ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. రాశీఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఇవే కాక…కోహినూర్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.