‘డీజే టిల్లు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ అనే సినిమా తీశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఇప్పుడు ‘తెలుసుకదా’ అనే సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి..ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా: తెలుసు కదా (SidduJonnalagadda Telusukada Movie Review)
ప్రధానా తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ విఎస్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిడివి:2 గంటల 18 నిమిషాలు
రిలీజ్ డేట్:17-10-2025
రేటింగ్: 2.25/5
కథ
వరుణ్ అనాథ. రెస్టారెంట్ ఓనర్‌గా లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అవుతాడు. ఇక లైఫ్‌లో ఓ మంచి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటాడు. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అం జలిని పెళ్లి చేసుకుంటాడు. కానీ అంజలి ప్రెగ్నెంట్ కాలేదని, తనకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని, డాక్టర్స్ కన్ఫార్మ్ చేస్తారు. దీంతో వరుణ్ – అంజలి ఎంతో నిరుత్సాహపడతారు. ఈ క్రమంలో డాక్టర్ రాగ కుమార్ వల్ల సరోగసీ గురించి అంజలి తెలుసుకుని, ఈ విధానంతో తల్లిదండ్రులు అవుదామని వరుణ్‌కి చెబుతుంది. వరుణ్ సరే అంటాడు. అయితే వరుణ్‌కి రాగ కుమార్ మాజీ ప్రేయసి. అంజలి భర్త వరుణ్ అని తెలిసే, రాగ కుమార్ తాను సరోగసీకి ఒప్పుకుంటుంది. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది? వరుణ్ – రాగకుమార్‌లు ఎందుకు విడిపోయారు? వరుణ్ – రాగల ప్రేమకథ తెలిసిన తర్వాత అంజలి ఎలా రియాక్ట్ అయ్యింది? వరుణ్–రాగ–అంజలిలు
ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది ‘తెలుసు కదా’ సినిమాలో చూడాలి.
విశ్లేషణ
తెలుసు కదా సినిమా రెగ్యులర్ స్టోరీ అయితే కాదు. ఇద్దరు హీరోయిన్స్, ఒక హీరో ఉన్నాడు కనక, ఇదెం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కాదు. క్యారెక్టరైజేషన్స్ డ్రివెన్ ఫిల్మ్. వరుణ్ క్యారెక్టరై జేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కథ తెలిసిందే. కానీ కథనం కొత్తగా సాగుతుంది. ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటుంది. లవ్‌లో డిఫరెంట్ లేయర్స్‌ని చూపించే ప్రయత్నం చేశారు దర్శకు రాలు నీరజ కోన. మాజీ ప్రేమికురాలిపై పగ తీర్చుకోవాలనే వరుణ్ ఆలోచన, భార్య అంజలిని ప్రేమగా చూసుకోవాలన్న థాట్స్ మధ్య వరుణ్ నలిగిపోవడం, ఇది పైకి కనిపించకుండ పైకి ఎక్స్‌ట్రార్డినరీ యాటిట్యూడ్ చూపించేవిధానం బాగుంటుంది.
కానీ కథలో ఏదో వెలితి కనిపిస్తుంది. సినిమా అంతా ఓ సీరియస్ టోన్‌లో వెళ్తుంది. వినోదం మోతాదు కాస్త తగ్గింది. వైవా హర్షతో కొంత ట్రై చేసినా, ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇది వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ప్రేమకథలు కొత్తగా ఉన్నా, సినిమాలో భార్యభర్తల ట్రాక్ రోటీన్‌గా కనిపిస్తుంది. విడాకుల కాన్సెప్ట్ బోర్ కొడుతుంది. క్లైమాక్స్‌లో కొత్తదనం లేకపోవడం ఆడియన్స్‌కు కాస్త నిరాశే. పైగా క్లైమాక్స్ ఎండింగ్‌లో క్లారిటీ లేదు. కేవలం డైలాగ్స్ బాగుంటే సరిపోదు. కథలో ఈ డైలాగ్స్‌కు తగ్గ ఇంపాక్ట్ ఉండాలి. ఈ రితీలో సినిమా ఉండగలగాలి. ఈ సినిమాలో ఇది లేదు. ఫస్టాఫ్ బాగానే ఉన్నా, సెకండాఫ్ చాలా డల్ అవుతుంది.
నటీనటులు – సాంకేతిక నిపుణత
డిఫరెంట్ షేడ్స్, కాంప్లెక్స్‌గా ఉన్న వరుణ్ క్యారెక్టరైజేషన్‌లో సిద్దు జొన్నలగడ్డ కనిపించాడు. సీరియస్ టోన్ యాక్టింగ్‌లోనూ మెప్పించాడు. అంజలి క్యారెక్టర్‌లో రాశీఖన్నా ఫర్వాలేదు. సెకం డాఫ్‌లో రాశీ క్యారెక్టర్‌కు స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. రాగ రోల్‌లో శ్రీనిధిశెట్టి ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌హాఫ్‌లో రాగదే సినిమాలో డామినేషన్. ఇక ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ అభిగా వైవా హర్షకు మంచి మార్కులు పడ్డాయి. సెకండాఫ్‌లో అన్నపూర్ణమ్మ ఎపిసోడ్ ఒకే. స్వరూప్ వంటివారు..వారి వారి పాత్రల్లో నటించారు.
తెలుసుకదా సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు తమన్‌మ్యూజిక్, ఆర్‌ఆర్ ఫ్లస్ అయ్యాయి. కానీ మల్లిక గంథ పాటలో, లిప్‌సింక్ మిస్సైనట్లుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువల ఉన్నతంగా, రిచ్‌గా కనిపించాయి.
ఫైనల్‌గా: లవ్ జానర్ లో రోటీన్‌కి భిన్నంగా తెలుసుకదా సినిమాను ఏదో కొత్తగా ట్రై చేశారు. కానీ ఈ ప్రయ త్నంలో విఫలమైయ్యారు. ప్రేమకథలు బాగున్నా, క్లైమాక్స్ లో కన్ఫ్యూజన్, బలం లేని సెకండ్ హాఫ్, కామర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వంటివి,ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లలేకపోయాయి.