Arasan: శింబు (STR Simbu) హీరోగా వెట్రిమారన్ (Vetrimaran) డైరెక్షన్‌లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్’ (Arasan Movie) అనే టైటిల్ ఖరారైంది. శింబు కెరీర్‌లోని ఈ 49వ సినిమాను కలైపులి.ఎస్. థాను నిర్మిస్తారు. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణను ఈ నెలలోనే ప్రారంభిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసి, ఆ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తారని, అనిరు«ద్ రవిచందర్ సంగీతం అందిస్తారనే ప్రచారం సాగుతోంది.
ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వడచెన్నై’ సినిమా బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా ఉంటుంది. వడచెన్నై సినిమాను సరికొత్తగా తీయే ప్రయత్నంలో భాగంగానే ‘అరసన్’ను ప్రారంభిస్తున్నట్లుగా వెట్రిమారన్ ఓ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ధనుష్‌తో ‘వడచెన్నై’ సినిమా ఫ్రాంచైజీ కూడా ఉంటుందన్నట్లుగా పేర్కొన్నాడు వెట్రిమారన్.
నిజానికి శింబు 49వ సినిమా విషయంలో మార్పులు చేర్పులు బాగానే జరుగుతున్నాయి. శింబు 49వ సినిమాకి, రాజ్‌కుమార్ దర్శకత్వం వహించాల్సింది. కయాదులోహర్ హీరోయిన్. డ్వాన్ పిక్చర్స్‌పై ఆనందభాస్కరన్ నిర్మించాల్సింది. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. అలాగే రామ్‌కుమార్ పెరియసామీ డైరెక్షన్‌లో శింబు ఓ వార్ డ్రామా చేస్తున్నట్లుగా, ఓ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇది శింబు 49వ సినిమా ప్రకటించారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా శింబు 49వ సినిమాగా ‘అరసన్’ తెరకెక్కనుంది.