శివకార్తీకేయన్‌ మదరాసి మూవీ రివ్యూ

Viswa
Sivakarthikeyan madharasi Review

శివకార్తీకేయన్‌ మదరాసి మూవీ రివ్యూ:Madharaasi Review

కథ

తమిళనాడు రాష్ట్రంలో గన్‌ కల్చర్‌ వినియోగాన్ని పెంచి, సొమ్ము చేసుకోవాలని ఓ సిండికేట్‌ గ్యాంగ్‌ ప్లాన్‌ చేస్తుంది. ఈ ప్లాన్‌ ప్రకారం తమిళనాడులోకి అక్రమ తుపాకులతో నిడించిన, వెహికల్స్‌ వస్తుంటాయి. ఈ వెహికల్స్‌ రాకను విరాట్‌ (విద్యుత్‌ జమాల్‌), చిరాక్‌ (షబీర్‌)లు హ్యాండిల్‌ చేస్తుంటారు. ఈ విషయం ఎన్‌.ఐ.ఏ ఆఫీసర్‌ ప్రేమ్‌ నాథ్‌కి (బిజీ మీనన్‌) తెలుస్తుంది. అక్రమ ఆయుధాలు ఉన్న ఫ్యాక్టరీని కూల్చేయాలని ఓ ఆపరేషన్‌ని స్టార్ట్‌ చేస్తాడు. మరోవైపు ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోవాలను కుంటుంటాడు రఘురామ్‌ (శివకార్తీకేయన్‌). ఈ ఇద్దరు ఓ అంబులెన్స్‌లో కలుసుకుంటారు. చావంటే పెద్దగా భయం లేని రఘురామ్‌యే తన ఆపరేషన్‌కు కరెక్ట్‌ వ్యక్తి అని భావిస్తాడు ప్రేమ్‌నాథ్‌. మరి..ఈ ఆపరేషన్‌ సజావుగా సాగిందా? మాలతి(రుక్మిణీ వసంత్‌)తో రఘురామ్‌కు ఎందుకు బ్రేకప్‌ అయ్యింది? ప్రేమ్‌నాథ్‌ తలపెట్టిన ఆపరేషన్‌ను అడ్డుకునేందుకు చిరాగ్, విరాట్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశారు? అన్నది ఈ సినిమాలో మిగిలిన కథ (Madharaasi Review)

 

విశ్లేషణ

మురగదాస్‌ సినిమాలంటే కమర్షియల్‌ తాలుకూ ఎలిమెంట్స్‌తో పాటుగా, ఏదో సందేశం కూడా ఉంటుంది. ఈ తరహా తన మార్క్‌ను ‘మదరాసి’ సినిమాలోనూ చూపించాడు మురగదాస్‌. గన్‌ కల్చర్‌ సమాజానికి ఎంత ప్రమాదకరమైన విషయాన్ని చర్చించాడు. అయితే ‘గజిని’ సిని మాలో హీరోకు డిజార్డర్‌ ఉన్నట్లు, ‘స్టాలిన్‌’ సినిమాలో హీరోకు గుండె పక్కన బుల్లెట్‌ ఉన్నట్లు…ఇలా హీరో క్యారెక్టరైజేషన్‌లో ఏదో ఒక లోపం పెడుతుంటాడు మురగదాస్‌. మద రాసి లోనూ అదే చేశాడు. హీరోకి డెల్యూషన్‌ అనే ఓ డిజార్డర్‌ పెట్టాడు. సిండికేట్‌ సన్ని వేశాల తో, మదరాసి సినిమా కాస్త ఆసక్తికరంగానే స్టార్ట్‌ అవుతుంది. కానీ ఈ తరహా ఆసక్తి మెల్లి మెల్లి గా తగ్గిపోతుంది. హీరో ఇంట్రోసాంగ్, ఫైట్‌…మళ్లీ రోటీన్‌ ట్రాక్‌ తీసుకుంటుంది. అయితే ఇంట్రవెల్‌ టైమ్‌కి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇక సెకండాఫ్‌ అంతా యాక్షన్‌తోనే సరిపోతుంది. అనిరు«ద్‌ మ్యూజిక్‌ మాయ ఈ సినిమాలో అయితే వినిపించలేదు. ఆర్‌ఆర్‌ సౌండ్‌ మెప్పించలేదు.

నటీనటులు-సాంకేతిక నిపుణులు

మదరాసి సినిమాలో శివకార్తికేయన్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ అయితే చేశాడు. ప్రేమ, అమాయ కత్వం, భయం లేని గుణం..ఇలాంటి అంశాలతో నిండిన రఘురామ్‌ క్యారెక్టర్‌ను శివకార్తీకేయన్‌ బాగానే చేశాడు. ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీలో మాలతిగా హీరోయిన్‌ రుక్మిణీవసంత్‌ రోల్‌కు యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్‌ లేనట్లు కనిపించింది. అయితే కథలో ఆమె పాత్ర కీలకం. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ తక్కువ. హీరోతో ఉన్న లవ్‌ట్రాక్‌ సీన్స్‌లో మెప్పించింది. ఎన్‌ఐఏ ఆఫీసర్‌ ప్రేమ్‌నాథ్‌గా బిజుమీనన్‌ యాక్టింగ్‌ మెప్పిస్తుంది. మంచి రోల్‌ దొరికింది ఆయనకు. చిరాగ్‌గా షబ్బీర్‌ యాక్టిం గ్‌ బాగుంది. ఇక మెయిన్‌ విలన్‌ విరాట్‌గా విద్యుత్‌ జమాల్‌ యాక్టింగ్‌ ఈ సినిమాకు మరో హైలైట్‌. ప్రేమ్‌నాథ్‌ కొడుకుగా విక్రాంత్, విమలారామన్‌ వంటి వారు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. క్యారెక్టరైజేషన్‌లో వేరియేషన్స్‌ చూపించే ప్రయత్నంలో, కథలో నాట కీయ తను పెంపొం దించడం లో మురగదాస్‌ కాస్త ఆలసత్వం చూపించినట్లు ఉన్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలైతే, కన్విన్సింగ్‌గా ఉండవు. కొన్ని ఊహాత్మక, సాగదీత సన్నివేశాలూ ఆడియన్స్‌ను థియేటర్స్‌లో వారి వారి ఫోన్స్‌ చెక్‌ చేసుకునే వెసులుబాటునికి కల్పించాయి.

ఫైనల్‌గా….సందేశంతో కూడిన ఓ వినూత్న యాక్షన్‌ డ్రామా మదరాసి. అక్కడక్కడ మదరాసి మెప్పిస్తాడు. అంచనాలు లేకుండ థియేటర్స్‌కు వెళితే, వారు ఈ సినిమాను ఎంజాయ్‌ చేయ వచ్చు. అయితే కాస్త ఒపిగ్గా చూడాలి.
రేటింగ్‌ 2.5/5

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *