దర్బార్, సికందర్ వంటి ఫ్లాప్ మూవీ తర్వాత దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ (Sivakarthikeyan Madharaasi). ఇటీవల ‘అమరన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న శివకార్తీకేయన్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ఇది. నిజానికి ‘అమరన్’ కంటే ముందే ఈ ‘మదరాసి’ సినిమా విడుదల కావాల్సింది. కానీ కుదరలేదు. ఇక మదరాసి సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్‌లు ఇతర లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సెప్టెంబరు 5న ఈ మదరాసి చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ అన్ని భాషల్లో మదరాసి సినిమా ట్రైలర్(Sivakarthikeyan Madharaasi Trailer)ను విడుదల చేశారు మేకర్స్.
తమిళనాడుకు సిక్స్ కార్గో ట్రక్స్ లోకల్ మేడ్ ఇల్లీగల్ గన్స్ వస్తున్నాయి…ఎలాగైనా ఆపాలి, ఎస్..సార్, తుపాకీ ఎవరి చేతిలో ఉన్నా విలన్ నేనేరా.., నీలానే ఇతరులను ప్రేమించు..అంతా నీకుటుంబమే అనుకో…ఏ రిలీజియన్ అయినా, అందరు దేవుళ్లు చెప్పేది ఇదే…. , ఇది నా ఊరు సార్…నేను వదలను’ అన్న డైలాగ్స్ మదరాసి సినిమా తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి. మదరాసి సినిమా తెలుగు ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి…ఈ సినిమాతో అయినా మురగదాస్ కమ్‌బ్యాక్ అవుతారా? లేదా? అనేది చూడాలి.
మరోవైపు ఈ మదరాసి సినిమా కథ ఇప్పటి కాదు. గతంలో ఇదే కథను హీరో షారుక్‌ఖాన్‌కు వినిపించారు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కానీ ఈ సినిమా చేసేందుకు షారుక్ ఆసక్తి చూపించలేదు. కొంత గ్యాప్ తర్వాత కథలో కొన్ని మార్పులు చేసి, ఫైనల్‌గా శివకార్తీకేయన్‌కు కథ వినిపించడంతో, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అలాగే మదరాసి సినిమాలో తొలుత హీరోయిన్‌గా కియారా అద్వానీని అనుకున్నారు. ఆల్మోస్ట్ కన్ఫార్మ్. కానీ చివరి నిమిషంలో రుక్మీణీ వసంత్‌ను తీసుకున్నారు. అప్పట్లో సప్తసాగరాలుదాటి సినిమా విడుదలై, రుక్మిణీకి మంచి పేరు వచ్చింది. దీంతో అప్పట్లో అందరు రుక్మిణీకే నటిగా అవకాశాలు ఇచ్చారు.