‘అమరన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు శివకార్తీకేయన్ (Sivakarthikeyan). ఈ సక్సెస్ జోష్‌తోనే మరో సినిమాను రిలీజ్ రెడీ చేస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో శివకార్తీకేయన్ ఓ యాక్షన్‌ప్యాక్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు మదరాసి (Sivakarthikeyan Madharasi) అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శివకార్తీకేయన్ బర్త్ డే (ఫిబ్రవరి 17) సందర్భంగా ‘మదరాసి’ టైటిల్‌ను అధికారికంగా వెల్లడించి, ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు చిత్రంయూనిట్. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరో యిన్‌గా చేశారు. మలయాళ నటి బీజూమీనన్, బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమాల్, తమిళ నటుడు విక్రాంత్, షబీర్‌లు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్ చేశారు. అనిరు«ద్ రవిచందర్ ఈ మూవీకి సంగీత దర్శకుడు.
ఈ సినిమా కాకుండ ‘పరాశక్తి’ అనే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు శివకార్తీకేయన్. ‘గురు, సూరారై పోట్రు (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) వంటి సినిమాలు తీసిన సుధా కొంగర ఈ మూవీకి దర్శకులు. శివకార్తీకేయన్ కెరీర్‌లోని ఈ 25వ సినిమాను ఆనందభాస్కరన్ నిర్మిస్తున్నారు. రవి మోహన్, శ్రీలీల ఈ చిత్రంలోని ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
ఈ చిత్రాలే కాకుండా…తమిళంలో ‘గుడ్‌నైట్’ వంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ మూవీ తీసిన వినాయక్ చంద్రశేఖరన్‌తో కూడా శివకార్తీకేయన్ ఓ మూవీ చేస్తారు. త్వరలోనే ఈ మూవీని గురించి అధికారిక ప్రకటన రానుంది.