శ్రీ విష్ణు కామ్రేడ్‌ కల్యాణ్‌

SPM
SPM

Web Stories

శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సాధారణ యువకుడిగా, నక్సలైట్‌గా శ్రీవిష్ణు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాకు, జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహిస్తుండగా, స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మి స్తున్నారు.

యాక్షన్, పొలిటికల్‌ టెన్షన్, రొమాన్స్‌ కామెడీ..ఇలా అన్నీ అంశాలతో ఈ సినిమా కొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో ‘బేబీ’ ఫేమ్‌ విజయ్‌ బుల్గానిన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos