oh bhama Ayyo Rama Review:కథ
రామ్ (సుహాస్)కు సినిమాలంటే ఇష్టం ఉండదు. తన స్నేహితులు సినిమా థియేటర్స్‌కు తీసుకువెళ్లినా తన థియేటర్ బయటే ఉండి, ఈ సినిమా కథ వింటూ, ఆ సినిమా హిట్టో ఫ్లాపో చెప్పేస్తాడు. అయితే రామ్‌కు సినిమాలంటే ఇష్టం ఉండకపోవడానికి కారణం తన తండ్రి గౌతమ్ (రవీంద్ర విజయ్). భర్త చేసిన మోసానికి బాధతో రామ్ తల్లి మీనాక్షి(అనిత) చనిపోతుంది. అయితే తానో డ్యాన్సర్ కావడంతో, తన కొడుకు రామ్ భవిష్యత్‌లో ఓ పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కంటుంది. తన కల నెరవేరకుండానే చనిపోతుంది. దీంతో రామ్‌ను, అతని మేనమామ (అలీ) చేరదీసి, పెంచిపెద్ద చేస్తాడు. ఈ క్రమంలో రామ్ జీవితంలోకి వస్తుంది సత్యభామ (మాళవికా మనోజ్). రామ్‌ను ఎలా గైనా దర్శకుడిని చేయాలనుకుంటుంది.
అసలు.. రామ్‌ను దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు అనుకుంటుంది. సత్యభామ-రామ్‌ల ప్రేమకథ ఎలా మొదలవుతుంది? రామ్-సత్యల పెళ్లికి సూర్య పెట్టిన కండీషన్ ఏమిటి? అనేది సినిమాలో చూడాలి, (oh bhama Ayyo Rama)
ohBhamaAyyoRama: విశ్లేషణ
తెలుగు సినిమా అంటే సెంటిమెంట్, ఎమోషన్, డ్రామా… ఉండాలి…అని ఈ సినిమాలో రెండుసార్లు వినిపిస్తుంది. నిజానికి ఈ కథలో సెంటి మెంట్, ఎమోషన్, డ్రామా ఉన్నాయి. కానీ అవి కొత్తగా లేవు. చాలా రోటీన్‌గా ఉన్నాయి. ఆడియన్స్ ఎప్పట్నుంచో చూసేసిన వాటిలా ఉన్నా యి. కొత్తదనం లేనిదే, స్టార్ హీరోల సినిమాలనూ సైతం రిజెక్ట్ చేస్తున్న ఈ రోజుల్లో ఈ రోటీన్ తరహా కథనంతో సినిమా ఆడియన్స్ ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు.
హీరో గోల్ ఏంటి? అనేది హీరోయిన్ చెప్పడం, తల్లి కలను చివర్లో హీరో తెలుసుకోవడం అనేది ఈ సినిమాలో సరిగ్గా చూపించలేదు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అనిత-రవీందర్‌ల ఎపిసోడ్ అయితే ఫుల్లీ అవుట్‌డేటెడ్ అనే చెప్పవచ్చు. వీటికి తోడు ఫస్ట్‌హాఫ్‌లో హీరో యిన్ చెప్పే కథలు ఆడియన్స్‌కు చిరాకు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో పెళ్లి సీక్వెన్స్, హీరోయిన్ ప్రేమకు, హీరోయిన్ తండ్రి సూర్య పెట్టిన కండీషన్ అనేది చాలా పాతకాలం నాటివి. ఈ పాటలు, ఫైట్స్, మ్యూజిక్…ఇలా ఈ సినిమాకు ఏదీ ఫ్లస్ కాలేదు. కానీ హీరోయిన్ మాళవిక మనోజ్ మంచి నటనను చూపించారు. కాస్త రిలీఫ్ దొరకుతుంది ఈ పాత్ర నుంచి. ఓ దశలో ఈ సినిమా ఈ క్యారెక్టర్‌నే నడిపిస్తున్నట్లుగా ఉంది. దర్శకుడు చాలా తెలివిగా బాహుబలి, కల్కి2898ఏడీ, చిరంజీవి, మహేశ్‌బాబు…ఇలా చాలామంది హీరోలను ప్రస్తావించాడు. ఇవేవీ సినిమాకు అదనపు ఆకర్షణగా కనిపించవు. అలీ-సుహాస్‌ల మధ్య వచ్చే ‘అమ్మ-మామ’ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా బాగా అనిపిస్తుంది.
ఎవరు ఎలా చేశారు?
రామ్ పాత్రలో సుహాస్ నటన సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపించింది. కానీ ‘కలర్‌ఫోటో, అంబాజీపేటమ్యారేజ్ బ్యాండు, ఉప్పుకప్పురంబు’ వంటి సినిమాల మాదిరిగానే, తనో సంపతి కార్డ్ క్యారెక్టర్ చేయడం మాత్రం బాగోలేదు. ఎమోషనల్ సీన్స్‌లో సుహాస్ నటుడిగా ఇంకాస్త మెరుగుప డాలి. ఇక సత్యభామ పాత్రలో మాళవిక మనోజ్ చక్కగా నటించారు. హైపర్ యాక్టివ్, ఎమోషనల్, లవ్ సీన్స్‌లో మంచి నటన చూపించారు.
వీలైనప్పుడల్లా కామెడీ చేసే ప్రయత్నం కూడా చేశారు. హీరో మేనమామ పాత్రలో అలీ ఉన్నంతలో బాగానే చేశారు. కానీ అలీలోని కమేడియన్‌ను కూడా దర్శకుడు వాడుకుని ఉండాల్సింది. హీరో తండ్రి-దర్శకుడు గౌతమ్‌గా రవీందర్, మీనాక్షిగా అనితలు బాగానే యాక్ట్ చేశారు. హీరోయిన్ తండ్రి, వ్యాపారవేత్తగా పెళ్లి ప్రుథ్వీ తన పాత్ర పరిధి మేరకు చేశాడు. మోయిన్ మహామ్మద్, సాత్విక్ ఆనంద్‌లు..వారి వారి పాత్రల పరిధి మేరకు చేశారు. దర్శకుడు హరీష్‌శంకర్, మరో దర్శక-నిర్మాత మారుతిలు చేసిన అతిధి పాత్రలకే పరిమితం అయ్యారు. రామ్ గోధల దర్శకత్వం ఇంకాస్త బాగా ఉండి ఉండాల్సింది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ పరంగా. నిర్మాత హరీష్ నిర్మాణ విలువల ఒకే. రథన్ మ్యూజిక్-ఆర్‌ఆర్, మణికంధన్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాయి. ఇంకాస్త ఎడిటింగ్ చేయవచ్చు.
ఫైనల్‌గా…అయ్యో..రామ!
రేటింగ్ 2.0/5.0