Sundeep Kishan: తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ జోసెఫ్ (Jason Sanjay) సినీ కెరీర్ మొదలైంది. ఓ దర్శకుడిగా సంజయ్ జోసెఫ్ కెరీర్‌ను మొదలుపె డుతున్నాడు. తండ్రి విజయ్ జోసెఫ్ ప్రస్తుతం తన లాస్ట్ సినిమా ను హెచ్. వినోద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సమయంలో జాసన్ తన కొత్త, తొలి సినిమాను ప్రకటించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడు.
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (మా నగరం సినిమాతో), మేర్లపాక గాంధీ, వంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సందీప్‌కిషన్ ఇప్పుడు విజయ్ జోసెఫ్ తనయుడు సంజయ్ జోసెఫ్‌ను దర్శకుడిగా పరి చయం చేస్తున్నాడు.
సందీప్‌కిషన్ హీరోగా తెలుగులో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘మాజాకా’ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపించడం లేదు. అలాగే సందీప్‌కిషన్ కమిటైన మరోమూవీ ‘మాయావన్ 2’ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది.