కొత్త జర్నీని మొదలుపెట్టారు హీరో సూర్య. సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమా (Suriya 46 movie shoot update)కు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్. తమిళ నాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత ఈ సినిమా జర్నీని మొదలుపెట్టారు సూర్య అండ్ టీమ్.
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే పీరియాడికల్ సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్, ఎమోషన్స్ మిళితమై ఉండే మూవీ ఇది. కాస్త వెంకీ అట్లూరి గత చిత్రం ‘లక్కీభాస్కర్’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాల మిక్సింగ్ స్టైల్లో ఈ మూవీ ఉంటుందట. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లోనే సూర్య షూటింగ్‌లో పాల్గొంటు న్నారు. వెంకీ అట్లూరితో ‘వాతి (తెలుగులో ‘సార్’, లక్కీభాస్కర్) సినిమాలకు పనిచేసిన జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నాడు. వీలైనొంత తొందరగా ఈ మూవీ చిత్రీకరణను ముగించాలన్నది చిత్రంయూనిట్ ప్లాన్.
#Suriya46 shoot begins! @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @venupro #SrikaraStudios pic.twitter.com/6CKR0VD5W8
— TollywoodHub (@tollywoodhub8) June 11, 2025
మరోవైపు …సూర్య గత చిత్రాలు ‘కంగువ, రెట్రో’ సినిమాలు థియేటర్స్‌లో సరిగ్గా ఆడని ఈ పరిస్థితుల్లో సూర్యకు ఓ మాంచి హిట్ మూవీ అయితే అవసరం. ఇప్పటివరకు ఫ్లాప్ మూవీ ఇవ్వని వెంకీ అట్లూరి, సూర్యకు కూడా ఓ హిట్ మూవీ ఇస్తాడెమో చూడాలి.
మరోవైపు ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. త్రిష హీరోయిన్‌గా చేశారు. ఈ మూవీ రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు.