అరె..మన టైము ఇది..కుమ్మిపడదొబ్బుదాం…కరుప్పు మాస్‌ టీజర్‌

Viswa
Suriya Karuppu Teaser And Firstlook

సూర్య (Suriya) హీరోగా చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘కరుప్పు (Karuppu)’. ఈ మూవీని నటుడు-దర్శకుడు ఆర్‌జే బాలాజీ డైరెక్ట్‌ చేశాడు. షూటింగ్‌ పూర్తయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ (Karuppu Teaser) మంచి మాస్‌ విజువల్స్‌లో కనిపిస్తుంది. సూర్య క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే..సూర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నారు. సూర్య కెరీర్‌లోని ఈ 45వ సినిమా టీజర్‌ను, సూర్య బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేశారు. బుధవారం సూర్య 50వ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కరుప్పు’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

టీజర్లోని డైలాగ్స్‌ ఇలా ఉన్నాయి..

కొబ్బరికాయకొట్టి, కర్పూరం వెలిగిస్తే …శాంతిచే దేవుడు కాడు…

మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై, దిగొచ్చే దేవుడు.

నా పేరు సూర్య…నాకు ఇంకో పేరు ఉంది…

అరె..భాయ్‌..ఇది మన టైము..కుమ్మిపడదొబ్బుతా…

కాలభైరవ…బలి బలి వీడు…

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిషలు కలిసి ఈ సినిమా కోసం మళ్లీ నటించారు. ఇంకా ఈ సినిమాలో ఇంద్రాన్స్‌, నట్టి, స్వసిక, ఎస్‌ శివాధ, అనఘా మయా రవి, సుప్రీత్‌రెడ్డిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా
కు సాయి అభ్యంకర్ మ్యూజిక్‌ డైరెక్టర్‌. దర్శకుడు ఆర్‌జేబీ (ఆర్‌జే బాలాజీ). కాగా ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టం రానుంది. మోస్ట్‌లీ ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో సూర్య, త్రిషలు లాయర్‌ పాత్రల్లో కనిపిస్తారు. కాస్త డివోషనల్ టచ్‌ కూడా ఉంటుందీ సినిమాలో. దీపావళి రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కరుప్పు సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యే సాధ్యసాధ్యాలపై ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంటుంది.
ఈ సినిమా కాకుండ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. అలాగే తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ‘వాడివాసల్‌’ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం ఉం

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *