Suriya45: మైథలాజికల్‌ మూవీతో సూర్య

Viswa
1 Min Read
Suriya45 Movie

Suriya45: పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘కంగువ’ సినిమాపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సూర్యను కంగువ చిత్రం ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ వెంటనే తెరుకున్న సూర్య మరో సినిమాను ప్రారంభించారు. సూర్య కెరీర్‌లో 55వ సినిమా రానున్న ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల పొల్లాచ్చిలో ప్రారంభమైయ్యాయి. దర్శకుడు ఆర్‌జే బాలాజీ ‘ముకుత్తి అమ్మన్‌ (తెలుగులో ‘అమ్మోరుతల్లి) సిఆలనిమా చేశారు. ఈ చిత్రం తరహాలోనే సూర్య 45వ చిత్రం కూడా కాస్త మైథలాజికల్‌ టచ్‌తో ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆల్రెడీ Suriya45 షూటింగ్‌ కూడాప్రారంభమైంది. ఈ చిత్రలో త్రిష హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. 2025లో సెకండాఫ్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది చిత్రంయూనిట్‌ ప్లాన్‌.

మరోవైపు కార్తీక్‌సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఓ యాక్షన్‌ లవ్‌స్టోరీ సినిమా చేశారు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్‌ కానుంది. తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సూర్య ‘వాడివాసల్‌’ అనే సినిమాకు కమిట్‌ అయ్యాడు. కానీ ఈ సినిమా ప్రారం భం కావడానికి ఇంకా సమయం ఉంది. సుధాకొంగర, బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌మెహ్రాలతో సూర్య కమిటైన సినిమాలు క్యాన్సిల్‌ అయ్యాయనే వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *