తమన్నా లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల 2’ (Odela 2 Review) టీజర్, ట్రైలర్ ఆడి యన్స్‌ను ఆకట్టుకున్నాయి. మరో అరుంధతి అంతటి హిట్‌గా ‘ఓదెల 2’ మూవీ నిలుస్తుందని, కొందరు ఆడియన్స్ ఊహిస్తున్నారు.
హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్. సింహా లీడ్ రోల్స్‌లో అశోక్‌తేజ డైరెక్షన్‌లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే మూవీ తీశారు. పూజితా పొన్నాడ, సాయి రోనక్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించగా, అశోక్‌తేజ దర్శకత్వం వహించారు. సంపత్‌నంది ఈ సినిమాకు కథ అందించాడు. 2022 ఆగస్టు 26న ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై, వ్యూయర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గంటన్నర నిడివిగల ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. తమిళ ఓటీటీ హక్కు లను ఆహా తీసుకుంది. కానీ..తమిళ, హిందీ రీమేక్‌లు ఆ సమయంలో ఎందుకో నిలిచిపోయాయి.
కొంతగ్యాప్ తర్వాత ‘ఓదెల రైల్వేస్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ (Odela2 Review Telugu) తీశారు దర్శకుడు సంపత్‌నంది (Odela2 director sampathnandi). ఆయన సూపర్ విజన్‌లో అశోక్‌తేజ (Odela2 director ashokTeja) ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కానీ రాధామోహన్ బదులుగా, డి. మధు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆశ్చర్యకరంగా ‘ఓదెల 2’ మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడుపోయాయి. పెట్టుబడి అంతా (దాదాపు రూ. 27 కోట్లు) రిలీజ్‌కు ముందే వచ్చేశాయి.
ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ క్రైమ్‌జానర్‌లో రూపొందింతే…సీక్వెల్‌కు మాత్రం డివోషనల్ అండ్ హారర్, థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’లో కథలో భాగంగా….రాధా (హెబ్బాపటేల్), తన భర్త తిరుపతి (వశిష్ఠ. ఎన్. సింహా)ను హత్య చేస్తుంది. దీంతో కథ ముగుస్తుంది. ఇక్కడ్నుంచే ‘ఓదెల 2’ కూడా మొదలు అవుతుందని తెలిసింది.

రాధా చేతిలో చనిపోయిన తిరుపతి ఆత్మగా ఓదెల గ్రామానికి వస్తాడు. ‘అరుంధతి’ సినిమాలో ఎలాగైతే పశుపతి శవం తిరగి ప్రాణం పోసుకుం టుందో…అలానే తిరుపతి ప్రేతాత్మగా వస్తుంది. వచ్చి ‘ఓదెల’ గ్రామ ప్రజలను పట్టీపీడస్తుంది. మరోవైపు ‘రాధా’ జైల్లో ఉంటుంది. తిరుపతి ఆత్మ బయటకు రావడంతో, రాధాకు కూడ ఇబ్బందులే నట. దీంతో రాధా సోదరి, నాగసాధువు శివశక్తి (Odela2 Tamannaah)…‘ఓదెల’ గ్రామానికి వచ్చి, అక్కడి ప్రజలను.. తిరుపతి ప్రేతాత్మ నుంచి ఎలా కపాడుతుంది? అన్నదే కథ. తమన్నా…వశిష్ఠ. ఎన్. సింహాల మధ్య వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయట. ట్రైలర్‌లో చూపించిన దానికి మించి సినిమాలో విజు వల్స్ ఉంటాయట. ముఖ్యంగా…క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటాయని, బోనాల జాతర నేపథ్యంతో ‘ఓదెల 2’ క్లైమాక్స్ ఉంటుందనే ప్రచారం సాగుతుంది. అజనీష్ లోకనాథ్ ఆర్‌ఆర్, సౌందర్ రాజన్ విజువల్స్ ఈ సినిమాకు కీలకంగా ఉండబోతున్నాయట. ఇక సంపత్‌నంది..కథ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్‌గా ఉండబోతుందని టాక్.
‘ఓదెల 2’ స్టోరీ (Odela2 story) గురించి చెప్పాలంటే..ప్రేతాత్మకు–పరమాత్మకు మధ్య జరిగే యుద్ధం’ అని సంపత్‌నంది పేర్కొన్నారు. అలాగే పంచాక్షరి మంత్రం తో తిరుపతి ప్రేతాత్మను నాగసాధువు అయిన శవశక్తి ఎలా కంట్రోల్ చేస్తుందన్నదే సినిమా మెయిన్ థిమ్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో నాగ సాధువు ఉపయోగించే పంచాక్షరి మంత్రం సినిమాలో కీలకమట.
మరికొన్ని గంటల్లో ఈ మూవీ రిజల్ట్ ఏంటో తెలియబోతుంది.