టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీ రివ్యూ (ఓటీటీ)..జగమంతా కుటుంబంనాది!

Viswa
TouristFamily Movie Review in telugu

ఫిల్మ్‌ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిన్న సినిమాలు అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. పెద్ద స్టార్స్‌ సైతం ఈ తరహా సినిమాలకు సలామ్‌ కొడతారు. అలాంటి సినిమాయే ఇటీవల తమిళంలో విడు దలైన ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. పదికోట్ల రూపాయాల లోపు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, రూ.75 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకులు రాజమౌళి, హీరో నాని, హీరో రజనీకాంత్‌లాంటి వారు ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ (TouristFamily OTT Review) సినిమా బాగుందని కితాబులిచ్చారు. అయితే ఈ టూరిస్ట్‌ ఫ్యామిలీ (TouristFamily Review)  సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి..ఇందర్నీ మెప్పించిన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి టూకీగా చదివేయండి.

TouristFamilyReview: కథ

శ్రీలంక దేశంలో జీవించలేక జీవనోపాధి కోసం భారతదేశానికి శరణార్థిగా వస్తాడు ధర్మదాస్‌ (ఎమ్‌.శశికుమార్‌). ధర్మదాస్‌కు భార్య వసంతి(సిమ్రాన్‌), ఇద్దరు కుమారులు ఉంటారు. పెద్ద కుమారుడు నితూషన్‌ (మిథున్‌), చిన్నోడు మురళి (కమలేష్‌ జగన్‌). ధర్మదాస్‌ కుటుంబం రామేశ్వరం రాగానే, రామేశ్వరంలో బాంబ్‌బ్లాస్ట్‌ జరుగుతుంది. ఈ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు. మరోవైపు తన బంధువు ప్రకాష్‌ (యోగిబాబు) సాయంతో రామేశ్వరంలోని కేశవ కాలనీలో ఓ పోలీసాఫీసర్‌ ఇంట్లో అద్దెకు దిగుతారు ధర్మదాస్‌ అండ్‌ ఫ్యామిలీ. తాము శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులమని తెలిస్తే, ఆశ్రయం దక్కదనే కారణంతో తమది కేరళ అని అబద్ధం చెబుతుంటారు ధర్మదాస్‌ అండ్‌ ఫ్యామిలీ. మరోవైపు రామేశ్వరంలో జరిగిన బాంబ్‌బ్లాస్ట్‌కు ధర్మదాస్‌ కుటుంబమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తారు? మరి..అప్పుడు ఏం జరిగింది? కేశవ నగర్‌ ప్రజలతో ధర్మదాస్‌ కుటుంబం ఎలా కలిసిపోయింది? బాంబ్‌బ్లాస్ట్‌కి– ధర్మదాస్‌ కుటుంబానికి నిజంగా సంబంధం ఉందా? పోలీసుల పరిశోధనలో ఏం తేలింది? అన్నది ఈ సినిమా మిగిలిన కథాంశం.

TouristFamilyReviewవిశ్లేషణ

ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. సమాజంలోని మానవత్వపు అంశాలు, భావోద్వే గాలతో మిళితం చేసి, దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ చక్కని స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసు కువచ్చాడు. తెలిసిన వారైనా, తెలియని వారైనా ఆపదలో ఉంటే సాయం చేయాలి, మనం ఇబ్బందుల్లో ఉన్నా, తోటివారు ఇబ్బందుల్లో ఉన్నా… అప్యా యంగా చిరునవ్వుతో పలకరించాలి అనుకునే మనస్తత్వం ఉన్న ధర్మదాస్‌ పాత్ర ఆడియన్స్‌కు తప్పక కనెక్ట్‌ అవుతుంది. ఓ తండ్రిగా కుటుంబ బాధ్యత కోసం తపన పడే ధర్మదాస్‌లాంటి వాళ్లు మన సమాజంలో తారపడుతూనే ఉంటారు. కానీ ఈ సినిమాలో తండ్రి బాధను అర్థం చేసుకునే కొడుకు, భర్త బాధ్యత గౌరవించే భార్యలాంటి పాత్రలూ ఉన్నాయి.

Tamil Hit film TouristFamily Movie Review in telugu in OTT
Tamil Hit film TouristFamily Movie Review in telugu in OTT

తండ్రి బాధ్యత, తండ్రి–కొడుకుల ఎమోషన్, భార్య–భార్త ప్రేమానురాగాలు, లవ్‌ఫెయిల్యూర్, జీవితంలో ఓడిపోయాననే కుంగుబాటు, నిజాయితీ, మంచితనం, జాతీయ సమైక్యత, స్నేహాం.. ఇలాంటి అన్నీ అంశాలను ఒకే సినిమాలో టక్‌ చేసేశాడు దర్శకుడు. ఈ అంశాలకు కోర్‌ పాయింట్‌కు కనెకై్ట ఉండటం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. ముఖ్యంగా సెకం డాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ భావోద్వేగాల సంభాషణలు, క్లైమాక్స్‌లో ధర్మదాస్‌ కుటుంబానికి కేశవ నగర్‌ ప్రజలు ఇచ్చే తోడ్పాటు, చర్చిలో జరిగే ఓ సన్నివేశం ఆడియన్స్‌ మనసులను తాకుతాయి. అలాగే ధర్మదాస్‌ చిన్న కొడుకు మురళి పాత్రతో వచ్చే హాస్యం కూడా ఆడియన్స్‌ను నవ్విస్తుంది. పాటలు, ఫైట్స్, ట్విస్ట్‌లు, మలుపులు గట్రా సినిమాలో ఏమీ లేవు. ఉన్నదంత ఆసక్తికరమైన కథాంశమే. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ సినిమా చూసిన ప్రేక్షకులకు కొంతకాలం తర్వాత ఓ మంచి సినిమా చూశామనే భావనైతే కలుగుతుంది. కొన్ని మైనస్‌లు ఉన్నా…సినిమాలో ఉన్న బలం దాటికి, వాటి ప్రస్తావన కూడా వృధాయే.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

ధర్మదాస్‌ పాత్రలో శశికుమార్‌ చక్కగా నటించాడు. మంచి మనసున్న వ్యక్తి పాత్రలో ఒదిగి పోయాడు. భావోద్వేగాల సమయంలో మంచి హహాభావాలను పలికించాడు. సగటు మధ్య తరగతి తండ్రి పాత్రలో తన నటనతో మెప్పించాడు. వసంతి పాత్రలో సిమ్రాన్‌ చక్కగా నటించారు. ఇక నిథూషన్‌ పాత్రలో మిథున్‌కు యాక్టింగ్‌ పరంగా మంచి మార్కులే పడ్డాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్‌ సీక్వెన్స్‌ బాగుంటుంది. ఈ సినిమాలోని ఫన్‌ ట్రాక్‌ మొత్తాన్ని మోసింది చైల్డ్‌ ఆర్టిస్ట్‌ కమలేష్‌ జగన్‌. ఓనమ్‌ సీన్, స్కూల్‌ మాస్టర్‌తో సీన్, మూవీ స్టార్టింగ్‌లో వచ్చే సీన్స్‌లో కమలేష్‌ పాత్రకు మంచి వెయిట్‌ ఉంది.

Touristfamily movie posters
Touristfamily movie posters

ధర్మదాస్‌ ఫ్యామిలీకి తోడుగా ఉండే ప్రకాష్‌ పాత్రలో యోగిబాబు చేశాడు. అప్పుడప్పుడు స్క్రీన్‌పై కనిపించే గెస్ట్‌ రోల్‌ యోగిబాబుది. ధర్మదాస్‌కు కారుడ్రైవర్‌ ఉద్యోగం ఇచ్చే రిచర్డ్‌ పాత్రలో భాస్కర్, తల్లిమరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కుర్రాడి పాత్రలో జీవంత్, పోలీసాఫీసర్లుగా భగవతి పేరుమాల్, రామ్‌కుమార్‌ ప్రసన్న, స్కూల్‌ టీచర్‌గా సుదర్శన్, ప్రేమలో మోసపోయిన అమ్మాయి కురల్‌గా యోగలక్ష్మీ వారి వారి పాత్రల మేరకు మెప్పించారు. యోగలక్ష్మీ ట్రాక్‌ ఆడియన్స్‌ను ఎమోషనల్‌గానూ కనెక్ట్‌ చేస్తుంది.

దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ చక్కని దర్శకత్వ ప్రతిభను చూపించాడు. రైటింగ్, డైరెక్షన్‌లో ఎక్కువ తప్పులకు చోటువ్వలేదు. అనవసరపు సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, రొమాంటిక్‌ సీన్స్, వల్గర్‌ కామెడీ వంటి వాటి జోలికి వెళ్లకండ చెప్పాలకున్న విషయాన్ని స్క్రీన్‌పై చూపించేశాడు. అరవింద్‌ విశ్వనాథన్‌ కెమెరా, భరత్‌ విక్రమన్‌ ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. సీన్‌ రోల్డన్‌ ఆర్‌ఆర్‌ మ్యూజిక్‌ బాగున్నాయి. చిన్న సినిమా కాబట్టి, ఈ స్థాయికి తగట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి.

ఫైనల్‌గా..: టూరిస్ట్‌ ఫ్యామిలీ…ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా

రేటింగ్‌:  3.5/5.0

తమిళ హిట్‌ గరుడన్‌ తెలుగు రీమేక్‌ భైరవం..తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Please Share
3 Comments