యువ హీరో తేజా సజ్జా (Tejasajja)మంచి జోరు మీద ఉన్నాడు. తేజా సజ్జా లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ (mirai) చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. రీతికా నాయక్ హీరో యిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, , శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, క్రితీ ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ సినిమా రిలీజ్ అంటున్నారు కానీ..మిరాయ్ సినిమా విడుదల దసరాకు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.
Intresting #TELUGU #Tollywood #Tollywoodhub #TeluguFilmNagar#MEGA158 & #TejaSajjaPMF2
For #Sankranti2027 pic.twitter.com/oRkw2TQDYV
— TollywoodHub (@tollywoodhub8) August 23, 2025
ఈ సినిమా ఇలా ఉండగానే తేజ సజ్జా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘మిరాయ్’ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, క్రితీ ప్రసాద్‌లతోనే తేజా సజ్జా హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 23న తేజా సజ్జా బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆశ్చ ర్యకరంగా ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. 2024 సంక్రాంతికి తేజా సజ్జా హీరోగా నటించిన ‘హను మాన్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మరోసారి సంక్రాంతి బరిలో తన లక్‌ను టెస్ట్ చేసుకోవాలనుకుంఉటన్నాడు తేజా సజ్జా.