ఇదే చరిత్ర…ఇదే భవిష్యత్‌…ఇదే మిరాయ్‌

Viswa
Tejasajja Mirai Telugu Trailer Released

‘హను-మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు. భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్‌, క్రుతీప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబరు 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ‘మిరాయ్‌’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ (Mirai Trailer) చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్‌లో ఈ క్రింది డైలాగ్స్‌ ఉన్నాయి.

ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతుంది…దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి

నువ్వు అనుకుంటున్న మనిషి…అడ్రస్‌ నేను కాదు….

ఈ దునియాలో ఏదీ నీది కాదు…భయ్యా…అన్నీ ….అప్పే… ఈ రోజు నీ దగ్గర….రేపు నా దగ్గర

నా గతం నక్షత్రం…నా ప్రస్తుతం ఉహాతీతం

తొమ్మిది గ్రంథాలు వాడికి దొరికితే…పవిత్రం గంగలో పారేది రక్తం

నువ్వు చేరుకోవాల్సిన మొదటి లక్ష్యం…శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం

నేను చేయగలనని నేను చూడని లోకం నమ్మింది..నాతో లేని నా తల్లి నమ్మింది…ఒక నేను నమ్మడమే మిగిలింది

ఇదే చరిత్ర…ఇదే భవిష్యత్‌…ఇదే మిరాయ్‌

రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీయా శరణ్‌, మంచు మనోజ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నాడు. సూపర్‌ యోధ పాత్రలో తేజా సజ్జా, బ్లాక్‌స్వార్డ్‌గా మంచు మనోజ్‌ నటించారు. హను-మాన్‌ సినిమాకు సంగీతం అందించిన హరి గౌరయే మిరాయ్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మైథలాజికల్‌ ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలో తొమ్మిది గ్రంథాల నేపథ్యంతో సాగుతుంది. ఓ మ్యాజికల్‌ స్టిక్‌తో హీరో చేసే సాహసాలతో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *