please subscribe to Tollywoodhub YouTube channel

తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కల్కి2898Ad.. లక్కీభాస్కర్ కు నాలుగేసి అవార్డ్స్

Viswa

Web Stories

దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా రాష్ట్రస్థాయి అవార్డుల అనౌన్స్‌మెంట్‌ రావడం జరిగింది. 2024లో విడుదలైన తెలుగు సినిమాలకు గానూ, తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను ప్రకటించింది.
జ్యూరీ అధ్యక్షురాలు జయసుధ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజులు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి, అవార్డుల విజేతల వివరాలను వెల్లడించారు. 1200లకు పైగా నామినేషన్స్‌ను జ్యూరి పరిశీ లించి, విజేతలను ప్రకటించినట్లుగా తెలిపారు. మొత్తం 11 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. వ్యక్తిగత
విభాగంలో 21మంది అవార్డులు వచ్చాయి. జ్యూరీ గుర్తింపులో ఆరు అవార్డులు వచ్చాయి. ఇక ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలోని నటనకు గాను, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు వరించింది. ‘35:చిన్న కథ
కాదు’ సినిమాలోని ప్రదర్శనకు గాను ఉత్తమ నటిగా నివేదాథామస్‌కు అవార్డు దక్కింది. తొలి ఉత్తమ చిత్రంగా ప్రభాస్‌ ‘కల్కి2898ఏడీ’ సినిమా నిలవగా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, తృతీయ చిత్రంగా
దుల్కర్‌సల్మాన్‌ లక్కీభాస్కర్‌ సినిమాలు నిలిచాయి.

మొత్తం అవార్డులో (జ్యూరీ అవార్డులను కూడా కలిపి) దుల్కర్‌సల్మాన్‌ ‘లక్కీభాస్కర్‌’, ప్రభాస్‌ ‘కల్కి2898ఏడీ’ సినిమాలకు నాలుగు అవార్డులు, అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’, ‘రజాకర్‌’, ‘కమిట కుర్రాళ్లు’ సినిమాలకు మూడేసి చొప్పున అవార్డులు వచ్చాయి. నివేదాథామస్‌ ‘35:చిన్న కథ కాదు’,
‘పొట్టేల్, రాజు యాదవ్, గామి’ చిత్రాలకు రెండేసి అవార్డులు వచ్చాయి.

20250529 132643

మొదటి ఉత్తమ చిత్రం:కల్కి2898ఏడ
ఉత్తమ ద్వితీయ చిత్రం: పొట్టేల్‌
ఉత్తమ తృతీయ చిత్రం: లక్కీభాస్కర్‌
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రూల్‌)
ఉత్తమ నటి: నివేదాథామస్‌ (35:చిన్న కథ కాదు)
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
చారిత్రక చిత్రం: రజాకార్‌
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్‌:మేం ఫ్రెండ్సండీ
ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కర్రాళ్లు)

20250529 104246

వ్యక్తిగత విభాగం:
ఉత్తమ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ (కల్కి2898ఏడీ)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రూల్‌)
ఉత్తమ నటి: నివేదాధామస్‌ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు:ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీస్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యూరో)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)
సంగీత దర్శకుడు:భీమ్స్‌ సిసిరోలియో (రజాకార్‌)
నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప ది రూల్‌లోని సూసూకీ..)
హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్‌
ఉత్తమ కథా రచయిత: శివపాలడుగు (మ్యూజిక్‌షాప్‌ మూర్తి)
స్క్రీన్‌ ప్లే: వెంకీ అట్లూరి
సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌రెడ్డి
ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌నూలి
ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ (గామి)
యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: కె. చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
ఆర్ట్‌ డైరెక్షన్‌: నితిన్‌–జిహానీ చౌదరి
మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్లశీను (రజాకార్‌)
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌కుమార్‌

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు
నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీభాస్కర్‌)
అనన్య నాగళ్ల (పొట్టేల్‌)
రాజు యాదవ్‌ నిర్మాతలు ప్రశాంత్‌రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి
స్పెషల్‌ జ్యూరీ మెన్షన్‌: ఫరియా అబ్దుల్లా (మత్తువదలరా 2)
తెలుగు సినిమాపై పుస్తకం: రెంటాల జయదేవ (పుస్తకంపేరు: మన సినిమా ఫస్ట్‌ రీల్‌)

2025 జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

Please Share
39 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi