Telugu big movies: గత ఏడాది ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’, ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ ‘పుష్పది రూల్’…ఇలా టాలీవుడ్‌లోని పెద్ద హీరోల సినిమాలన్నీ 2024 ద్వితీయార్థంలోనే వచ్చాయి. సేమ్ సీన్ 2025లోనూ కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు ఏవీ 2025 జూన్‌లోపు వచ్చేలా లేవు.
Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ
పవన్ మూవీస్ జూన్ తర్వాతే…
చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం గ్రాఫిక్స్ చిక్కుల్లో చిక్కుతుంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా టీజర్‌లోని గ్రాఫిక్స్ పట్ల మెగాఫ్యాన్స్ పెదవి విరిచారు. దీంతో గ్రాఫిక్స్‌పై రాజీ పడకూడదని, విశ్వంభర టీమ్ ఈ పనిపై ఉంది. ఇందుకు మరింత సమయం పడుతుంది. కాబట్టి విశ్వంభర రిలీజ్ మేలో ఉండకపోవచ్చు. పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రం మేకర్స్ ముందు చెప్పినట్లుగా మార్చి 28న రిలీజ్ కావడం లేదు.సో..కచ్చితంగా ఈ ఏడాది దసరా సమయంలో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ కూడాసెకండాఫ్‌లోనే (Telugu big movies) రిలీజ్ ఉండేలా కనిపిస్తోంది.
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ మేకర్స్ ముందుగా చెప్పినట్లుగా, ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదు. సో..సెకండాఫ్‌లోనే రిలీజ్. ఇంకా..బాలకృష్ణ కెరీర్‌లోని మరో పెద్ద మూవీ ‘అఖండ 2’ చిత్రం దసరా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ధనుష్–నాగార్జునలు చేసిన ‘కుబేర’ చిత్రం జూలైలో రిలీజ్ అంటున్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ దీపావళికి,, హృతిక్‌రోషన్‌తో ఎన్టీఆర్ చేసిన ‘వార్ 2’ ఆగస్టు 14న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
మహేశ్, అల్లు అర్జున్ మూవీస్ లేవు
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ల సినిమాలు ఎలాగూ ఈ ఏడాది ఉండవు. ఇక2025 తొలిభాగంలో మేలో విడుదల కానున్న నాని ‘హిట్ 3’, రవితేజ ‘మాస్ జాతర’, విజయ్‌దేవరకొండ– గౌతమ్ తిన్ననూరి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి…ఆ సమయంలో రిలీజ్ అవుతాయా? లేదా? అనేది చూడాలి.