Nani HIT3 Cinema Review: హీరో నాని హిట్‌3 సినిమా రివ్యూ

Viswa
4 Min Read
Nani HIT3 Cinema Review: హీరో నాని హిట్‌3 సినిమా రివ్యూ

సినిమా: హిట్‌ 3 (Nani HIT3 Cinema Review)
ప్రధానతారాగణం: నాని, శ్రీనిధిశెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్, కోమలీ ప్రసాద్, అమిత్, శ్రీనాథ్, బ్రహ్మాజీ
నిర్మాణం: నాని, ప్రశాంతి తిపిర్నేని
దర్శకత్వం: శైలేష్‌ కొలను
కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌
సంగీతం: మిక్కీ జే మేయర్‌
ఎడిటింగ్‌:కార్తీక శ్రీనివాస. ఆర్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: నాగేంద్ర తంగాల
విడుదల తేదీ: మే 1
నిడివి– సెన్సార్‌: 2 గంటల 37 నిమిషాలు (18 సంవత్సరాలు పైబడినవారికి మాత్రమే)
రేటింగ్‌:2.5/5.0

కథ

వైజాగ్ కొత్త ఎస్పీ గా ఛార్జ్ తీసుకుంటాడు అర్జున్ సర్కార్ (నాని). అగ్రిసిస్ అండ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్. వైజాగ్ లో ఓ మర్డర్ జరుగుతుంది.

వైజాగ్ కి రాకముందు జమ్మూ కాశ్మిర్ లో ఎస్పీ గా పనిచేసాడు అర్జున్ సర్కార్. అక్కడ ఓ మర్డర్ జరుగుతుంది. వైజాగ్ లో జరిగిన మర్డర్, జమ్మూ కాశ్మిర్లో జరిగిన మర్డర్స్ ఓకే విధంగా ఉంటాయి. ఈ తరహా మర్డర్స్ దేశ వ్యాప్తంగా జరుగుతుంటాయి.

ఈ సైకో పాత్ మర్డరర్స్ ను అర్జున్ సర్కార్ ఎలా కట్టడి చేయాలనుకున్నాడు. అర్జున్ సర్కార్ కు, అతని ప్రేయసి మృదుల (శ్రీనిధి శెట్టి), పోలీస్ ఆఫీసర్ వర్ష (కోమలి ప్రసాద్) ఎలా హెల్ప్ చేశారు? అసలు CTK FREEDOM అంటే ఏమిటి? CTK  మోటివ్ ఏంటి? వైజాగ్ లో మిస్ అయిన పాప ను అర్జున్ సర్కార్ ఎలా కాపాడాడు? అయినా.. అర్జున్ సర్కార్ ను పోలీస్ లు  క్రిమినల్ గా డిసైడ్ చేసి, ఎందుకు అరెస్ట్ చేశారు? అన్నది మిగిలిన కథ.

 

విశ్లేషణ

మేకర్స్ ముందు గానే చెప్పినట్లు ఇది ఫుల్ వైలెన్స్ మూవీ. విజువల్స్ రక్త శిక్తం గా ఉంటాయి. పిల్లలు ఈ సినిమా కు దూరంగా ఉంటేనే బెటర్.

ఓ కోర్ట్ సీన్ నుంచి మొదలయినా మూవీ.. ఓ మర్డర్ సీన్ తో ముందుకెళ్తుంది. ఆ నెక్స్ట్ అర్జున్ సర్కార్ లవ్ ట్రాక్ తో సినిమా స్లో గా అవుతుంది. సైకో పాత్ మర్డర్ మిస్టరీ, మర్డర్స్ ప్యాట్రన్ను హీరో కనిపెట్టడం తో విరామం కు టైమ్ అవుతుంది. బీహార్ ఛేజింగ్ సీన్ సూపర్. సెకండ్ హాఫ్ అరుణాచల్ ప్రదేశ్ కి షిఫ్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అంతా ఓ సెట్ లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్… యాక్షన్ లవర్స్ కు నచ్చుతాయి.

కాస్త నెగటివ్ షెడ్స్ ఉన్న హీరోయిక్ డార్క్ రోల్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతూన్నాయి. ఇలాంటి రోల్ నే ఈ మూవీ లో చేసారు నాని. సినిమా లో లవ్ ట్రాక్  స్పీడ్ బ్రేకర్. సినిమాలో కొన్ని సాగదీత సన్నివేసాలు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ బేబీ ఎపిసోడ్ తర్వాత నుంచి సినిమా మరింత ఊపందుకుంటుంది. ఇక్కనుంచి యాక్షన్ ఆగదు. కొంత సినిమాటిక్ లీబర్టీతీసుకున్నారు. సస్పెన్స్ గెస్ట్ రోల్స్ బాగున్నాయి.

హిట్ 1..హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. హిట్ 2..వైజాగ్ బ్యాక్ డ్రాప్. కానీ.. హిట్ 3 కి…నేషనల్ కనెక్ట్ విటీ  ఉండేలా కథ రాసుకున్నాడు శైలేష్ కొలను. అలాగే తన నిర్మాత నాని కి ఫ్యాన్ బాయ్ సర్వీస్ లు బాగానే చేశాడు శైలేష్. నాని ఫ్యాన్స్ కి విజిల్ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. ఏసీపీ వీరప్పన్ గా కార్తీ ని చూపించి HIT4 కి లీడ్ ఇచ్చారు.

ఎవరు ఎలా చేశారు?

అర్జున్ సర్కార్ గా నాని యాక్టింగ్ బాగా చేశాడు.  ‘వి’ మూవీ తర్వాత మరోసారి తన డిఫరెంట్ డార్క్ సైడ్ యాక్టింగ్ యాంగిల్ ని చూపించాడు నాని. షార్ట్ డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ యాక్షన్, యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్ బాగా చూపించాడు. 40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి వ్యక్తి గా పర్వాలేదనిపించాడు. మృధుల గా శ్రీనిధి శెట్టి కి మంచి రోల్ లభించింది. చిన్న పాటి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. హీరో తో లవ్ ట్రాక్ ఒకే. కానీ ఈ  క్యారెక్టర్ లోని సస్పెన్స్ ఎలిమెంట్ కొత్త గా ఏమి లేదు. విలన్ గా ప్రతిక్ కనిపించాడు. పోలీస్ ఆఫీసర్ ధన్య గా రుహిన్ చేశారు.

హీరో ఫాదర్ గా సముద్రఖని,జమ్మూ కాశ్మిర్ ఎస్పీ గా రవి గా సూర్య శ్రీనివాస్, ఆఫీసర్ వర్ష గా కోమలి ప్రసాద్, డీజీపీ నాగేశ్వరావు గా రావు రమేష్,ఓ సైకో కిల్లర్ గా అమిత్  వారి వారి పాత్రల మేరకు చేశారు.

మిక్కీ కొత్త మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ లో క్లాస్, మాస్ ఆర్ ఆర్ ప్లే చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర వర్క్ బాగుంది. విజువల్స్, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…నార్మల్ ఇన్వెస్టిగేషన్ విత్ ఎక్సట్రా వైయలెన్స్.

 

 

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *