Neeraja Kona: క్యాస్టూమ్ డిజైనర్ నీరజకోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న తొలి సినిమా ‘తెలుసు కదా’. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధిశెట్టి, రాశీఖన్నాలు హీరో యిన్స్‌గా నటించారు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నీరజ కోన ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
- నేను ఏ సినిమాకీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయలేదు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా నేను 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. తెలుగు, తమిళంలోని టాప్‌స్టార్స్ సినిమాలకు వర్క్ చేశాను. ఈ అనుభవం నాకు హెల్ప్ అయ్యింది. ఇదే నా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్.
- నాకు చిన్నప్పట్నుంచే కథలు రాసే అలవాటు ఉంది. ఓ కవిత్వం పుస్తకంగా కూడా పబ్లిక్ కాబడింది. అలా కథలు చెప్పాలని ఉన్న నాకు, సినిమా కథను రాయగలననే నమ్మకం వచ్చిన తర్వాత ‘తెలుసు కదా’ కథను రాశాను. తెలుసుకదా సినిమా క్యారెక్టర్స్ డ్రివెన్ స్టోరీ. ఇందులో వరుణ్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ, రాగాగా శ్రీనిధిశెట్టి, అంజలిగా రాశీఖన్నా నటించారు.
- తెలుసు కదా సినిమాకు తొలుత ‘హే గుడ్‌బై’ అనే టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత ‘తెలుసు కదా’ అని పెట్టాం. ‘తెలుసు కదా’ అనే పదాన్ని మనం, వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా వినియోగిస్తాం. ఇక్కడ మేం అదే చేశాం.
- మా అమ్మబర్త్ ఏప్రిల్ 2. ఆ రోజున నేను సిద్దు జొన్నలగడ్డకు కథ చెప్పగా, ఆయన సింగిల్ సిట్టింగ్‌లో ఒకే చేశాడు. దర్శకురాలిగా నాకు అవకాశం లభించింది. అందుకే ఆ రోజు నా లైఫ్‌లో మర్చిపోలేని రోజు. నా దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ కూడా ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఉంటుంది. ‘తెలుసు కదా’ సినిమా తరవాత నా కొత్త సినిమా వివరాలు చెబుతాను.