Ustaad Bhagat Singh Dekhlenge Saala Song: ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఉస్తాద్‌భగత్‌సింగ్ (Ustaad Bhagat Singh Movie) . ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా యాక్ట్ చేయగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. కాగా, తాజాగా ఈ సినిమాలోని ‘దేఖ్‌లేంగే సాలా’ (Ustaad Bhagat Singh Dekhlenge Saala Song) పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మంచి లిరిక్స్, పవన్‌కల్యాణ్ గ్రేస్ మూమెంట్స్‌తోఈ పాట ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. భాస్కరభట్ల ఈ సినిమాకు సాహిత్యం అందించగా, విషాల్ దద్లానీ ఆలపించారు.
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి పవన్‌కల్యాణ్‌యే కారణమన్న వార్తల్లో నిజం లేదని, ఇంకా పవన్ సహ కారం వల్లే ఈ సినిమా చిత్రీకరణ త్వరితగతిన పూర్తయిందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. తాను తొలుత ఓ గబ్బర్‌సింగ్‌లాంటి కథను అనుకున్నాని, ఆ తర్వాత ఓ రీమేక్ ప్లాన్ చేశనాని, ఆ నెక్ట్స్ ఫైనల్‌గా ఫ్యాన్స్‌కు నచ్చేలా, ఆడియన్స్ మెచ్చేలా కొత్త కథతో ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా తీశానని హరీష్‌శంకర్ చెప్పుకొచ్చారు.
