ప్రభాస్ (Prabhas) తొలిసారిగా హారర్ అండ్ కామెడీ జానర్‌లో చేస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’ (TheRajasaab Runtime). ఈ సినిమాకు మారుతి దర్శకుడు. డిసెంబరు5న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా నిడివి మూడుగంటలు ఉంటుందని ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా మారుతి చెప్పారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా రాణించలేదు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్-నాగార్జునల ‘కుబేర’, మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాల నిడివి 3 గంటలు ఉండటం అనేది ఆడియన్స్‌కు పెద్ద రుచించలేదు. ల్యాగ్‌గా ఫీలవుతున్నారు. అలాంటిది ఓ హారర్ డ్రామాతో ‘ది రాజాసాబ్’ (TheRajasaab )సినిమాలో ఆడియన్స్‌ను మూడుగంటల పాటు దర్శకుడు మారుతి ఏ విధంగా ఎంగేజ్ చేస్తారనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొని ఉంది. స్క్రీన్‌పై ప్రభాస్ ఉండటం, సరికొత్తగా కామెడీ చేయడం ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ పాయింటే. కానీ కథలో సందర్భానుసారంగా కామెడీ లేకపోతే, ఎంత పెద్ద స్టార్ కామెడీ చేసిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరీప్పుడు. మరి..రాజాసాబ్ సినిమాలో ఏం జరుగుతుందో చూడాలి.
‘ది రాజాసాబ్’ (TheRajasaab) సినిమాలో నిధీఅగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లు హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. తాత-మనవళ్ల కథ ఇది. ఈ సినిమాలో ప్రభాస్ తాతగా సంజయ్‌దత్ యాక్ట్ చేశారు. ప్రభాస్ తండ్రిగా ప్రభాస్‌యే కనిపించే చాన్సెస్ ఉన్నాయి. అలాగే ది రాజాసాబ్ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎసిపోడ్‌సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని తెలిసింది.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఓ దశలో ఈ సినిమాను రెండుపార్టులుగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారుట మేకర్స్. రెండు పార్టులు వద్దని, ఒకేపార్టుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి..ఏం జరుగుతుంతో చూడాలి.