హీరోయిన్ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘ఓదెల 2’ (Odela2 Release) మూవీ ట్రైలర్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంది. ‘ఓదెల2’ సినిమా రిలీజ్‌కు ముందే, ప్రాఫిట్‌జోన్‌లోకి ఎందుకు వెళ్లిందనే విషయం ట్రైలర్ కంటెంట్ చూసిన వారికి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. ‘ఓదెల 2’ ట్రైలర్ (Odela2 trailer) విజువల్స్ సూపర్‌గా ఉన్నాయి. ఓదెల 2 మూవీని రూ. 27 కోట్ల బడ్జెట్‌తో తీశారు. ఈ బడ్జెట్‌లో ఈ రేంజ్ విజువల్స్ తీసిన దర్శకుడు సంపత్‌నంది, మరో దర్శకుడు అశోక్‌తేజలను మెచ్చుకోవాల్సిందే.
ఈ మూడు నిమిషాల ట్రైలర్‌లో తమన్నా యాక్టింగ్, డైలాగ్స్ సూపర్భ్‌గా ఉన్నాయి. ట్రైలర్‌ని బట్టి, ఈ సిని మా మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ తమన్నా, వశిష్ట ఎన్. సింహాల మధ్యే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకరకం గా..‘ఓదెల 2’ మూవీ అనుష్కాశెట్టికి ‘అరుంధతి’ ఎలానో, తమన్నాకు ‘ఓదెల 2’ అలా..అని అంటు న్నారు. రిలీజ్ తర్వాత కూడా ‘ఓదెల 2’ సినిమా ఇదే పాజిటివ్ బజ్‌ను కంటిన్యూ చేయగలిగితే తప్పకుండ బ్లాక్‌బస్టర్ అవుతుంది. డి.మధు నిర్మించిన ‘ఓదెల 2’ సినిమా ఏప్రిల్ 17న (Odela2 Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘ఓదెల రైల్వేష్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపుదిద్దుకుంటుంది. తొలిపార్టులో రాధా (హెబ్బా పటేల్) క్యారెక్టర్, తిరుపతిని(వశిష్ట ఎన్ సింహా)ను హాత్య చేసి, జైలుకు వెళ్తుంది. ఈ తిరుపతి క్యారెక్టర్‌యే ఆత్మలా వచ్చి ‘ఓదెల’ గ్రామాన్ని ఇబ్బంది పెడుతుంది. రాధా (హెబ్బాపటేల్) చెల్లెలి పాత్ర భైరవిగా తమన్నా నటించారు. అలాగే కాశీ నుంచి ఓదెల వచ్చి, అక్కడి గ్రామప్రజలను తిరుపతి ఆత్మ నుంచి కాపాడే శివశక్తి పాత్రలోనూ తమన్నానే యాక్ట్ చేస్తున్నారు. అంటే…తమన్నా ద్విపాత్రాభినయం కావొచ్చు. అయితే భైరవి పాత్ర ద్వారా, తిరుపతి ప్రేతాత్మను..శివశక్తి ఎలా అంతం చేయించింది? అన్నదే ‘ఓదెల 2’ స్టోరీగా స్పష్టం అవుతుంది. ట్రైలర్‌లో ఉన్న ఒకట్రెండు చిన్నపాటి షాట్స్ …మొదట్లో భయపడిన భైరవి పాత్ర, ఆ తర్వాత రౌద్రంగా మారడాన్ని గమనించవచ్చు. ఇలా…‘ఓదెల 2’ స్టోరీని ఊహించవచ్చు. ఇంకా ‘ఓదెల 2’ క్లైమాక్స్ ‘విరూపాక్ష’లో మాదిరి, ఊరిగ్రామ ప్రజలను ఇన్‌వాల్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అది ఎందుకో సినిమాలో చూడాలి.