కమల్‌హాసన్ లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’ ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 38 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ఈ ‘థగ్‌లైఫ్’ మూవీ సినిమా జూన్ 5న రిలీజ్‌కు (Kamalhaasan Thuglife Release )రెడీ అవుతోంది. లేటెస్ట్‌గా ‘థగ్‌లైఫ్’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశా రు.
ట్రైలర్‌ని బటి…‘థగ్‌లైఫ్’ సినిమా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరుగుతుందని స్పష్టం అవుతోంది. అలాగే ‘థగ్‌లైఫ్’ మూవీ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ మూవీ తండ్రీకొడుకులుగా కమల్ హాసన్, శింబు నటించారు. అయితే కథలో శింబుకు మారుతండ్రిలా కమల్‌హాసన్ నటించి నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో కమల్‌హాసన్, శింబుల మధ్య వచ్చే యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు బలంగా ఉండబోతున్నాయి. అప్యాయంగా ఉండే ఈ తండ్రీకొడుకులు ‘నువ్వా..నేనా?’ అని ఎందుకు పోట్లాడుకున్నారు? అందుకు దారితీసిన పరి స్థితులు ఏమిటి? అన్నది సినిమాలో చూడాలి.
Kamalhaasan Thuglife Release and Cast and Crew: ఎవరెవరు నటించారు!
కమల్‌హాసన్ (Kamalhaasan Thuglife) , శింబులు మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. త్రిషా, అభిరామి,నాజర్, ఐశ్వర్యాలక్ష్మి, అశోక్ సెల్వన్, జోజూ జార్జ్, పంజక్ త్రిపాఠి, అలీ ఫజల్, నిత్యా శ్రీ, తనికెళ్లభరణి, సాన్య మల్హోత్రా…ఇలా ఇరవైమందికి పైగా ప్యాండింగ్ స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో ఉంది. మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు.
Kamalhaasan Thuglife: వద్దనుకున్న వాళ్లు ఎవరు?
‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కమల్‌హాసన్, దర్శ కుడు మణిరత్నం కాంబినేషన్‌తో మూడు దశాబ్దాల తర్వాత ‘థగ్‌లైఫ్’ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మూవీ ప్రకటన రాగానే..పెద్ద పెద్ద పేర్లే వినిపించాయి. అప్పటికే మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో మెయిన్ లీడ్ రోల్ చేసిన జయం రవిని ‘థగ్‌లైఫ్’ కోసం మళ్లీ ఒప్పించారు మణి రత్నం. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి దుల్కర్ సల్మాన్‌ను తీసుకొచ్చారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘జయం’ రవి, మణిరత్నం ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ‘జయం’ ప్లేస్‌లో శింబు, దుల్కర్‌సల్మాన్ ప్లేస్‌లో అశోక్ సెల్వన్‌ను మేకర్స్ ఎంపిక చేసుకుని, షూటింగ్‌ను పూర్తి చేశారు.
thugLife:కొంత విమర్శలు!

‘థగ్‌లైఫ్’ సినిమాలో కమల్‌హాసన్‌కు జోడీగా అభిరామి, శింబుకు జోడీగా త్రిష కనిపిస్తారని అందరు ఊహించారు. కానీ..త్రిషతో కమల్‌హాసన్‌కు లవ్ ట్రాక్ ఉన్నట్లుగా సినిమాలో కని పించడం ఆడియన్స్‌ను కొంత షాక్‌కు గురించేసింది. 70 ఏళ్ల వయసు వ్యక్తితో 40 ఏళ్ల త్రిషతో లవ్‌ట్రాక్ ఏంటని కొందరు నెటిజన్లు పెదవివిరిస్తున్నారు. అలాగే త్రిష ఫ్యాన్స్ కూడా కాస్త హార్ట్ అయ్యారు.

ThuglifeStory:స్టోరీపై కూడా భిన్న కథనాలు!
మణిరత్నం డైరెక్షన్‌లో 2018లో చెక్క చివంద వానం (తెలుగులో ‘నవాబ్’) సినిమా వచ్చింది. ఈ సినిమా స్టోరీ ట్రాక్‌ను ‘థగ్‌లైఫ్’ సినిమా పోలీ ఉందనే కామెంట్స్ సోషల్‌మీడియాలో వినిపిస్తున్నాయి. 2018 సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్‌ను మెప్పించడంలో విఫలైమంది. మరి..థగ్‌లైఫ్ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.