ThugLife OTT: హీరో కమల్‌హాసన్ (Kamalhaasan) , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లోని ‘థగ్‌లైఫ్’ (thugLife) సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 5న విడుదలైంది. ‘నాయగన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ..దాదాపు 35 సంవత్సరాల తర్వాత …కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష, శింబు, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, అసిఫ్ అలీ..ఇలా ప్రముఖ తారాగణం అంతా ‘థగ్‌లైఫ్’ సినిమాలో భాగమైయ్యారు. దీంతో ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని రిలీజ్‌కు ముందు అనుకున్నారు. అంతకుముందు ఏడాది కమల్‌హాసన్ శంకర్‌తో తీసిన ‘ఇండియన్ 2′ సినిమా డిజాస్టర్‌ను మర్చిపోయేలా..’థగ్‌లైఫ్’ సినిమా ఉంటుందని కమల్‌హాసన్ ప్యాన్స్, మణిరత్నం ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఏవీ వర్కౌ ట్ కాలేదు. జూన్ 5న విడుదలైన ‘థగ్‌లైఫ్’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆడియన్స్ అంచనాలను, సినీ విమర్శకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు హైలైట్ కాలేకపోయింది.
కమల్‌హాసన్- మణిరత్నంల థగ్ లైఫ్ మూవీ రివ్యూ
‘థగ్‌లైఫ్’ సినిమా రిజల్ట్‌ను గురించి ఈ చిత్రం దర్శకుడు మణిరత్నం కూడా క్షమాపణలు చెప్పారు. తమ నుంచి ప్రేక్షకులు ఆశించిన సినిమా ఇది కాదని తమకు అర్థమైందని, థగ్‌లైఫ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నానని మణిరత్నం పేర్కొన్నారు. అయితే సడన్‌గా ‘థగ్‌లైఫ్’ సినిమా ఓటీటీలో దర్శనమిచ్చింది (Thuglife Streaming on NETFliX OTT) . నిజానికి..’థగ్‌లైఫ్’ (thuglifeonNetFlix OTT) సినిమా ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ‘థగ్‌లైఫ్’ సినిమా డిజాస్టర్ కావడంతో, మూవీ యూనిట్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపి, కాస్త అమౌంట్ రాబట్టుకుని, నాలుగు వారాలకే ఓటీటీలో వదిలేశారు. అయితే థగ్‌లైఫ్ సినిమా ఇంత సైలెంట్‌గా ఓటీటీలోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

కమల్‌హాసన్ తర్వాతి చిత్రం కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బుఅరివులతో ఉండాల్సింది. కానీ వీరికి దర్శకత్వంలో పెద్దగా అనుభవం లేదు. ‘ఇండి యన్2, థగ్‌లైఫ్’ వంటి డిజాస్టర్స్ తర్వాత రిస్క్ తీసుకుని కొత్తవారితో సినిమా చేసేందుకు కమల్‌హాసన్ సిద్దంగా లేకపోవచ్చు. ఈ తరుణంలో కమల్‌హాసన్ తుదిపరి సినిమా ఏమై ఉండొచ్చనే టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.