AamirKhan:ఆమిర్‌ఖాన్‌తో మూవీ కోసం టాలీవుడ్‌ నిర్మాతల పోటాపోటీ

AamirKhan: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌ను ఎలాగైన తెలుగులోకి తీసుకురావాలని, తెలుగు నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Viswa
1 Min Read
AamirKhan new photo

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌(AamirKhan)ను ఎలాగైనా తెలుగులోకి తీసుకురావాలని టాలీవుడ్‌ నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఆల్రెడీ ఆమిర్‌ఖాన్‌తో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగింది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోగా సన్నీడియోల్‌తో మైత్రీమూవీమేకర్స్‌ (MythrimovieMakers) ఆల్రెడీ ‘జాట్‌’ అనే సినిమా చేస్తున్నారు. లోకేష్‌ ఫిల్మ్‌ కూడా కన్ఫార్మ్‌ అయితే మైత్రీమూవీ మేకర్స్‌ బాలీవుడ్‌లో చేసే రెండో ఫిల్మ్‌ ఆమిర్‌ఖాన్‌తోనే అవుతుంది.

ఆమిర్‌ఖాన్‌తో సినిమా చేసేందుకు ‘దిల్‌’ రాజు (DilRaju) కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారనే టాక్‌ తెరపైకి వచ్చింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎప్పట్నుంచో ఓ టాప్‌ హిందీ దర్శకుడితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమిర్‌ఖాన్‌ కోసం వంశీ పైడిపల్లి ఓ సినిమా కథను రెడీ చేశారని, అన్నీ కుదరితే ఆమిర్‌ఖాన్‌తో సినిమా ఉంటుందనే టాక్‌ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Suriya45: మైథలాజికల్‌ మూవీతో సూర్య

ఆమిర్‌ఖాన్‌ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘గజని’. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలని ఆమిర్‌ఖాన్‌ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. సీక్వెల్‌ కోసం టాలీవుడ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ను కూడా కలిశారట ఆమిర్‌ఖాన్‌. అయితే మురుగదాస్‌ ప్రస్తుతం సల్మాన్‌
ఖాన్‌తో ‘సికందర్‌’ మూవీ చేస్తున్నారు. సో..గజిని సీక్వెల్‌కు టైమ్‌ పడుతుంది.

ఇలా తెలుగులో ప్రముఖ నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్‌ రాజు, మైత్రీమూవీమేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు బాలీవుడ్‌ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్‌తో సినిమా చేసేందుకు పోటీ పడుతుండటం విశేషం

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ రజనీకాంత్‌ హీరోగా చేస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్‌ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *