‘పుష్ప ది రూల్’ మూవీతో మాసివ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు అల్లు అర్జున్ (AlluArjun). ఈ హీరో నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తో (Director Trivikram) ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సంక్రాంతి తర్వాత ఓ పూజా కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నారని తెలిసింది.
Nani Hit3: నానిని టెన్షన్‌లోకి నెట్టిన సూర్య
అయితే ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యంపై పట్టు ఉన్న త్రివిక్రమ్ ఇప్పటివరకు అయితే…ఈ జానర్‌లో మూవీ చేయలేదు. ఫస్ట్‌టైమ్ బన్నీ కోసం త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ చేయనున్నారు. మోస్ట్‌లీ, రామాయాణం ఆధారంగా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ మూవీ షూటింగ్‌ను ఏప్రిల్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పటివరకూ ప్రీ ప్రొడక్షన్ వర్స్స్ జరుగుతూనే ఉంటాయి.

అయితే ఇప్పుడు ప్రెజర్ అంతా త్రివిక్రమ్‌పైనే ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ తీసిన గత మూవీ ‘గుంటూరుకారం’ సక్సెస్ కాలేదు. ఇటు బన్నీ చేసిన ‘పుష్ప 2’ మూవీ బ్లాక్‌బస్టర్. దీంతో ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సిన ఒత్తిడిలో త్రివిక్రమ్ ఉంటారు. పైగా ఇప్పటివరకు త్రివిక్రమ్ పాన్ ఇండియా సక్సెస్ చూడలేదు. కానీ ఆయన సమకాలీకులు రాజమౌళి, ఇటీవల సుకుమార్ భారీ పాన్ ఇండియా సక్సెస్‌లు చూశారు. ఇలా…ఒత్తిడి త్రివిక్రమ్‌పై కచ్చితంగా ఉంటుంది.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
ఇక గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో…’ చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. దీంతో వీరి కాంబోలోని నాలుగో మూవీపై కూడా ఆడియన్స్‌లో తప్పక అంచనాలు ఉంటాయనుకోవచ్చు.