‘క’ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టింది. దాదాపు 50 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మూవీ ‘దిల్ రుబా’. ‘క’ సినిమా విజయం సాధించింది కాబట్టి, ఈ మూవీపై అంచనాలు ఉంటాయి. కానీ ‘దిల్ రుబా’ (KiranAbbavaram Dilruba) ఏ మాత్రం తేడా కొట్టిన కిరణ్ కెరీర్‌కు మరో ఎదురుదెబ్బ ఎదరవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Chiranjeevi Movie: సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్
‘క’ సినిమా విడుదలైనప్పుడు పరిస్థితులు వేరు. ‘క’ సినిమా సమయంలో శివకార్తీకేయన్ ‘అమరన్’, దుల్కర్‌సల్మాన్ ‘లక్కీభాస్కర్’ చిత్రాలు విడు దలైయ్యాయి. అయితే ‘క’ సినిమా ప్రీ రిలీజ్ విషయంలో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు…తెలుగు ఇడియన్స్‌లో కొంత సింపతీ క్రియేట్ అయ్యింది. పైగా ఆ సమయంలో పక్కా తెలుగు సినిమా కూడా ‘క’నే. ప్రీమియర్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఇలా ‘క’ మూవీ హిట్ కావడానికి అన్ని పరిస్థితులు కలిసొచ్చాయి.
NTR:ఎన్టీఆర్ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చింది!
కానీ ‘దిల్ రుబా’ పరిస్థితులు వేరు. ‘దిల్ రుబా’ (KiranAbbavaram Dilruba Release) లవ్‌స్టోరీ మూవీ. ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆల్రెడీ నాగచైతన్య–సాయిపల్లవిల ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘తండేల్’, విశ్వక్‌సేన్ మోడ్రన్ లవ్‌స్టోరీ ‘లైలా’, తెలంగాణ రూరల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాలు కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్‌కు రెడీ అయ్యాయి. తండేల్ (Thandel) ఫిబ్రవరి7న, రాజు వెడ్స్ రాంబాయి, లైలా (Laila) …చిత్రాలు ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్నాయి. ‘దిల్ రుబా’ రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఫిబ్రవరి 14నే అంటున్నారు. మిగతా చిత్రాలు కూడా లవ్ స్టోరీస్‌యే కావడంతో ఆ ఎఫెక్ట్ ‘దిల్ రుబా’పై పడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!
‘దిల్ రుబా’ సినిమాకు విశ్వ కరుణ్ డైరెక్టర్. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ…లు కలిసి నిర్మించారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Rashmika Mandanna Thama: ప్రేతాత్మగా రష్మికా మందన్నా…దీపావళికి థియేటర్స్‌లోకి…!