‘యానిమల్’ సినిమాలో ఓ సైడ్ హీరోయిన్‌లా చేసిన త్రిప్తి దిమ్రీ (Animal heroine TriptiDimri)కి సూపర్భ్ చాన్స్ లభించింది. యూనిమల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Spirit movie ditrctor) తన నెక్ట్స్ మూవీలోనూ త్రిప్తికి చాన్స్ ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం సైడ్ హీరోయిన్‌గా కాదు..మెయిన్ హీరోయిన్‌గానే. ప్రభాస్ (Spirit movie Hero) తొలిసారిగా పోలీ సాఫీసర్‌గా యాక్ట్ చేయనున్న ఈ మూవీలో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ (Prabhas Spirit movie heroine) నటిస్తారు. సందీప్‌రెడ్డివంగ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
కొన్ని రోజులుగా ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగింది. దీపిక కూడా ఆల్మోస్ట్ ఒకే చెప్పారట. కానీ చివరి నిమిషంలో దీపికా ప్లేస్‌లో త్రిప్తికి చాన్స్ వచ్చింది. నిజానికి యానిమల్ మూవీ తర్వాత బాలీవుడ్‌లో త్రిప్తి (Heroine TripriDimri) ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

యానిమల్ సినిమాలో సైడ్ హీరోయిన్‌గా చేసినప్పటికీని, ఈ మూవీ తర్వాత విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ్ చతుర్వేది వంటి బాలీవుడ్ యువ కథనాయల సరసన త్రిప్తికి వరుస చాన్స్‌లు దక్కాయి. ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి. ఇలా బాలీ వుడ్‌లో త్రిప్తి క్రేజ్ మెల్లిగా పెరిగింది. ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాహుబలి లాంటి హీరో ప్రభాస్ సరసన చాన్స్ దక్కించుకుంది త్రిప్తి (Prabhas movie heroine TriptiDimri).
టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ చిత్రీకరణ మొదలవుతుంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజి, ది రాజాసాబ్’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలవు తుందని ఊహింవచ్చు.